పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి


Sat,May 18, 2019 02:02 AM

నీలగిరి : పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 23న తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీచేసిన అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లతో శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23న ఉదయం 8 గంటలకు ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి ఉదయం ఆరున్నరకు చేరుకోవాలన్నారు. 7 గంటలకు స్ట్రాంగ్ రూం అబ్జర్వర్‌లు, అభ్యర్థులు, ఏజెంట్లు సమక్షంలో తెరవడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్‌ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందని, అవి లేకుండా లోపలికి అనుమతి లేదన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, పెన్నులు, వాటర్ బాటిల్స్‌కు అనుమతిలేదని పేర్కొన్నారు. టేబుల్ల వారీగా కౌంటింగ్ ఏజెంట్ల నియామకం ఫారం 18లో, ఏజెంట్ల ఆధార్, అడ్రస్‌ప్రూఫ్‌తో అందజేయాలన్నారు. ప్రతి అసెంబ్లి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను అభ్యర్థిని నియమించుకోవచ్చని సూచించారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్‌పేపర్, ఈటీపీబీఎస్ లెక్కింపుకు, ఏఆర్‌ఓ టేబుల్ వద్ద ఏజెంట్లు నియామకం చేయవచ్చన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్, రాజకీయ పార్టీ సమావేశాల నోడల్ అధికారి జహీరుద్దీన్ పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...