కొనసాగిన టీఎస్‌ పీఈసెట్‌


Fri,May 17, 2019 02:42 AM

-రెండో రోజు హాజరైన 384 విద్యార్థులు
-పరిశీలించిన టీఎస్‌పీఈసెట్‌ కన్వీనర్‌ సత్యనారాయణ
ఎంజీయూనివర్సిటీ : తెలంగాణలో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌పీఈసెట్‌ ఫిజికల్‌ ఎపీసీయన్సీ పరీక్షలు రెండో రోజు గురువారం ఎంజీయూలో హోరాహోరీగా సాగాయి. తెల్లవారుజామున 5.30 నుంచి 11.30 వరకు వివిధ అంశాలలో క్రీడలు జరిగాయి. విద్యార్థులు తమ హాల్‌ టికెట్లతో పేర్లు నమోదు చేసుకుని వాటిలో పాల్గొన్నారు. క్రీడలను స్వయంగా దగ్గరుండి టీఎస్‌పీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొ॥ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు కల్పించారు.

రెండో రోజు 384 మంది హాజరు...
ఎంజీయూలో జరుగుతున్న టీఎస్‌పీఈసెట్‌ ఫిజికల్‌ ఎపీసీయన్సీ పరీక్షలకు రెండో రోజు 585 మంది హాజరు కావల్సి ఉండగా 384 మంది హాజరు కాగా 201 మంది గైర్హాజరయ్యారు. వీరిలో బీపీఈడీకి 317 మందికి గాను 210 మంది హాజరు కాగా, 107 మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా యూజీడీపీఈడీకి 268 మందికి 174 మంది హాజరు కాగా, 94 మంది హాజరు కాలే

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...