డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


Fri,May 17, 2019 02:39 AM


దేవరకొండ, నమస్తేతెలంగాణ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహి ళా డిగ్రీ కళాశాల దేవరకొండలో 2019-20 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సు ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్‌ కోఆర్డినేటర్‌ సుధాకర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ మిరియాల హనుమంతు గురువారం ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ మొదటిసంవత్సరం ఇంగ్లీషు మీడియంలో ప్రవేశానికి జూన్‌ 8న నిర్వహించనున్న అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ టెస్ట్‌ (టీజీయూజీ-సెట్‌)కు హాజరుకావాలని సూచించారు. ప్రవేశ పరీక్ష రాయాలనుకునే విద్యార్థు లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీజీటీడబ్ల్యూగురుకులం.

తెలంగాణ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఈనెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీఏ(ఈహెచ్‌పీ) గ్రూపులో 40, బీకాం.కంప్యూటర్‌ గ్రూపులో 40, బీస్సీ(ఎంపీసీఎస్‌) గ్రూపులో 40, బీఎస్సీ(బీజడ్సీ)గ్రూపులో40, బీఎస్సీ(ఎంబీజడ్సీ) గ్రూపులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు 8985455759 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...