140 క్లస్టర్లు..564 గ్రామాలు...


Fri,May 17, 2019 02:36 AM

జిల్లాలో 140 వ్యవసాయ క్లస్టర్లలోని 564 గ్రామాల్లో 4,15, 521 మంది రైతుల నుంచి సాగు వివరాలు సేకరించాల్సి ఉం డగా ఇప్పటి వరకు 1,12,953(27.18 శాతం) మంది రైతుల నుంచి తీసుకున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 31 మండలాల్లో ఇప్పటివరకు అత్యధికంగా కనగల్‌ మండలంలో 52.39శాతం సర్వే పూర్తి కాగా అత్యల్పంగా డిండి 16.26శాతం మాత్రమే సర్వే చేపట్టారు. వాస్తవంగా గత నెల 15నే సర్వే ప్రారంభమైనప్పటికీ తొలి 10 రోజులు పెద్దగా దృష్టి సారించని యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలాఖరు వరకు నివేదించాల్సిన నేపథ్యంలో ఇటీవల ముమ్మ రం చేశారు.

పరిషత్‌ ఎన్నికలు ఉండటంతో వచ్చే నెల వరకు గడువు ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను కోరినప్పటికి గడువు ఇవ్వని కారణంగా ఆలోపే పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించి సర్వే చేస్తున్నారు. ప్రతి రోజు 9 వేల నుంచి 12 వేల మంది రైతుల నుంచి డేటా తీసుకునే విధంగా ఏఈవోలు బాధ్యత వహించి ఈ సర్వే చేపడుతున్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...