ముమ్మరంగా ‘సాగు’ సర్వే


Fri,May 17, 2019 02:36 AM

-44 అంశాలపై రైతుల నుంచి వివరాల సేకరణ
-ఇప్పటి వరకు 1.28 లక్షల మంది రైతుల డేటా ఆన్‌లైన్‌
-పంట కాలనీల ఏర్పాటే లక్ష్యంగా సర్వే
-వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో నిర్వహణ
-ఈ నెలాఖరు వరకు కొనసాగనున్న సర్వే
నల్లగొండ, నమస్తే తెలంగాణ: వ్యవసాయం దండుగన్న పాలకుల విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకెళ్తున్న ప్రభు త్వం పంటకాలనీల వైపు దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే ఆరాటపడుతూ ఈ శాఖలో అనేక సం స్కరణలు చేపడుతూ మార్కెట్‌లో అవసరాలు, డిమాండ్‌ ఆధా రంగా పంటల ఉత్పత్తి చేపడితే రైతుకు మేలు జరుగుతుందని భావించిన ప్రభుత్వం పంటకాలనీలను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుంది.

వాతావరణ పరిస్థితులు, భూముల్లోని సారాన్ని బట్టి పంటలు సాగు చేస్తే మంచి దిగుబడి రావడంతో పాటు రైతుకు ఆర్థ్ధిక వనరులు సైతం పెరిగే అవకాశం ఉంది. ఇందులోభాగంగానే జిల్లా వ్యాప్తంగా ఈ సాగు సర్వేను గత నెల లో వ్యవసాయ యంత్రాంగం చేపట్టింది. ‘ఆధార్‌ సమాచార వినియోగానికి అంగీకార పత్రం’ పేరుతో ఈ సర్వేలో భాగంగా ప్రతి రైతు నుంచి 44 అంశాలను సేకరిస్తు ఇప్పటివరకు 30 శాతం పూర్తి చేశారు.

44 అంశాలతో కూడిన సర్వే ...
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌ 15న ప్రారంభమైనటువంటి సాగు సర్వే రైతువారీగా ముమ్మరంగా కొనసాగుతుంది. వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ సిబ్బంది సహకారంతో అన్ని గ్రామాల్లోను రైతువారీగా 44 అంశాలను సేకరిస్తు ఈ సర్వే చేపడుతున్నారు. తొలుత 39 అంశాలే ఉండగా ఆ తర్వాత మరో 5 అంశాలను ప్రభుత్వం జోడించింది. ప్రతి రైతు ప్రస్తుతం ఏ పంట వేశాడు...దానివిస్తీర్ణం..పెట్టుబడి...దిగుబడి...

మిగులుబడి కోణం లో వివరాలు సేకరిస్తు సర్వే చేపడుతున్నారు. రైతువారీగా చేపట్టే ఈ సర్వేలో రైతు సాగు చేసిన పంట భూమి వివరాలు, వాటిని మార్కెటింగ్‌ చేయడంపై ప్రధాన దృష్టి సారించారు. ఈనెల చివరి వరకు ఈ రైతు వారీ వివరాలను సేకరించి ఎప్పటికప్పు డు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. జిల్లాలోని 140 క్లస్టర్లలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు ఉద్యాన శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తీసుకున్న డేటాను ఎప్పటికప్పుడే వారి వద్ద ఉన్నటువంటి ట్యాబ్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...