‘పది’లో ఫెయిలైన వారికి ప్రత్యేక శిక్షణ


Fri,May 17, 2019 02:34 AM

నీలగిరి: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలో, వసతి గృహాల్లో మార్చి 2019లో పదోతరగతిలో ఫెయిలైన గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు గిరిజన సం క్షేమశాఖ అధికారి తోకల నారాయణస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు గానూ బాలురకు దేవరకొండలోని బాలుర వసతిగృహంలో, బాలికలకు దేవరకొండలోని బాలికల వసతిగృహంలో సప్లిమెంటరీ కోచింగ్‌ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...