పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటాలి


Sun,April 21, 2019 12:07 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో గులాబీ శ్రేణులు సత్తాచాటాలని, అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆ పార్టీ ఎన్ని కల పరిశీలకుడు తక్కెల్లపల్లి రవీందర్‌రావు పేర్కొన్నారు. శనివారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఉన్న 31మండలాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థ్దులనే గెలిపించి తొలిసారిగా నల్లగొండ జడ్పీ పీ ఠంపై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున పరిషత్ ఎన్నికలకు అన్ని నియోజక వర్గాల్లో కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధిష్టానం అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థ్దులకు టికెట్లు కేటాయిస్తుందని వారి బీఫామ్ ఇచ్చిన అభ్యర్థి గెలుపుకోసం అం దరూ గత ఎన్నికల్లో లాగానే సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్‌లో ఎన్నో పదవులు వస్తాయని ఎవరు నిరాశ పడకుండా క్యాడర్ మొత్తం ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే అన్ని ప్రాం తాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థ్దులను అధిక మెజార్టీ తో గెలిపించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా సత్తా చాటామో అదే స్థాయి లో పరిషత్ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించాలన్నారు. సీఎం కేసీఆర్ నల్లగొండపై దృ ష్టి సారించాడని ఇక్కడ ఎక్కువ స్థ్దానాలు గెలిపించి ఆయనకు బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఉ ందన్నారు. ఎన్నికల అనంతరం నల్లగొండకు అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి అధిక నిధులు వచ్చే అవకాశం ఉందని ఆ నిధులతో ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థ్దులే అధిక సంఖ్యలో గెలుస్తారని దీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో తాను నా ర్కట్‌పల్లి నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తానని ప్రజలు ఆశీర్వాదించాలని కోరారు. సమావేశం లో మాజీ ఎమ్మెల్యే వేము ల వీరేశం, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వల్లి, సుంకరి మల్లేష్‌గౌ డ్, మాలె శరణ్యారెడ్డి, కరీంపాష, చీర పం కజ్ యాదవ్, బక్క పిచ్చ య్య, సింగం రామ్మోహన్, జమాల్‌ఖాద్రి, బొర్ర సుధాకర్, ఫరీదుద్దిన్, కటికం సత్తయ్య గౌడ్, బకరం వెంకన్న పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...