పశుగ్రాసానికి ఉపాధి నిధులు


Sun,April 21, 2019 12:07 AM

నల్లగొండ, నమస్తేతెలంగాణ : వేసవిలో పశువులకు గ్రాసం కొరత.. దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో అర్హులు, ఆసక్తి కలిగిన వారిని గుర్తించి పశువులకు గ్రాసం అందించడంతోపాటు ఆయా గ్రామాల శివార్లలో నీటి తొట్లు నిర్మించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పశువులు ఉన్నటువంటి వారు కనీసం అర ఎకరం భూమి ఉన్నప్పటికీ గడ్డి పెంచుకుంటానంటే సబ్సిడీలో విత్తనాలు ఇవ్వడంతోపాటు రెగ్యులర్‌గా యజమానికి వేతనం సైతం చెల్లించనుంది. అంతేగాక ఫర్టిలైజర్ సైతం నిధులు అందజేస్తూ గ్రామ శివార్లలో నీటి తొట్లను నిర్మించేందుకు నిధులను కేటాయించింది. అన్ని గ్రామాల్లో ఆసక్తి కలిగిన వారి నుంచి ప్రతిపాదనలు తీసుకుని వెంటనే మంజూరు చేయించే విధంగా ఆ శాఖ యంత్రాంగం చర్యలు చేపడుతుంది.

తాగునీటికి ఇబ్బందులు...
వేసవి వచ్చిందంటే మానవాళితోపాటు పశు పక్ష్యాదులకు తాగునీటికి కష్టం వస్తోంది. మానవాళి తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా నీరందించే విధంగా చర్యలు తీసుకోగా పశువులకు నీటి సమస్య లేకుండా నీటి తొట్ల నిర్మాణం చేపడుతుంది. అంతేగాక ఈ వేసవిలో 45 రోజుల్లోనే కోతకు వచ్చేటువంటి గడ్డి విత్తనాలను ఆసక్తి కలిగిన రైతులకు సబ్సిడీపై అందజేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్క్యులర్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగానికి రాగా దీని ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి మండలం నుంచి కనీసం 30, 40మంది లబ్ధిదారులను గుర్తించి జిల్లా వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఈ నిధులను సద్వినియోగం పరుచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించింది.

వేసవి దాహార్తిని తీర్చేందుకే...
సాధారణంగా వేసవి ఫిబ్రవరి నుంచే ప్రారంభమైనప్పటికీ మే చివరి నాటికి తీవ్రతరమవుతుంది. అయితే ప్రస్తుతం యాసంగి సీజన్‌లో కోతకు వచ్చిన వరి పైరు కోసిన తర్వాత గ్రాసం సమస్య మొదలవుతుంది. ఏప్రిల్ చివరి నాటికి ఈ సమస్య పెద్దగా ఉండకపోయినప్పటికీ మే, జూన్ నెలల్లో గ్రాసం కొరత ఎక్కువ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పశువులకు ఈ వేసవిలో గ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకుంటుంది. అంతేగాక మే నెలలో నీటి కొరత సైతం తీవ్రంగా ఉండడంతోపాటు చెరువులు సైతం ఎండిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పశువులకు తాగునీరు దొరకడం కష్టంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాల శివార్లలో పశువుల తాగునీటి తొట్లు నిర్మించి అందులో నీటిని నింపితే పశువులు, మేకలు, గొర్రెలు దాహార్తిని తీర్చుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

రెండు రకాల గడ్డి విత్తనాల సరఫరా...
ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకుని 45 రోజుల్లోనే కోతకు వచ్చేటువంటి గడ్డి విత్తనాలను సబ్సిడీలో ఇచ్చి పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫాడర్ డ్రాట్ మిటిగేషన్ గడ్డి విత్తనాలను ప్రధానంగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కరువు వచ్చినప్పుడు అనతి కాలంలో ఈ గడ్డి చేతికొస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ విత్తనాలను సరఫరా చేస్తారు. దీంతోపాటు ఎస్‌హెచ్‌జీ, జొన్న, ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న వంటి వెరైటీ గడ్డిని సైతం పెంచుకోవచ్చు. ఇక ఏడాది పాటు కోతకు వచ్చేటువంటి పెరినియల్ గడ్డిని సైతం పెంచుకునేందుకు విత్తనాలను ఇస్తోంది. దీంతోపాటు ఏపీబీఎన్, స్టయిలో, న్యూట్రిసిడ్, సీఓ-4, ప్యార గ్రాస్ వంటి గడ్డి కూడా ఏడాదిపాటు కోతకు రానున్నందున దీన్ని సైతం కావాలంటే సబ్సిడీలో ఇవ్వనుంది.

నిధుల కేటాయింపు ఇలా....
45 రోజుల్లో కోతకు వచ్చేటువంటి గడ్డి విత్తనాలకు ప్రభుత్వం రూ.13,192 ఇవ్వనుంది. అందులో కూలీల వేతనం రూ.7710, విత్తనాలు, యూరియా ఇతర క్రిమిసంహార మందులకు రూ.5482 కేటాయించారు. ఇక ఏడాది పాటు గడ్డిని పెంచుకునే వారికి రూ.34,242 మంజూరు చేయనున్నారు. దీనిలో కూలీల వేతనం రూ.19,885 ఇవ్వనుండగా విత్తనాలు, ఇతర సామగ్రి, దున్నకాలకు రూ.14,367 కేటాయించారు. ఇక పశువుల తొట్లకు కావల్సిన మెటీరియల్ కోసం రూ.19,578 చెల్లించనుండగా 18రోజుల పాటు కూలీలకు వేతనం కింద రూ.3,678 చెల్లించనున్నారు. ఈ పశువుల తొట్లు 2మీటర్ల వెడల్పు, 5మీటర్ల పొడవుతో నిర్మించాల్సి ఉంటుంది.

ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలి
వేసవిలో పశువులకు గ్రాసం కావాలన్న లేదంటే నీటి తొట్ల

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...