యాదాద్రిలో భక్తుల కోలాహలం


Fri,April 19, 2019 02:35 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ శాస్ర్తోక్తంగా నిత్య పూజలు కోలాహలంగా కొనసాగాయి. గురువారం ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన శ్రీస్వామి అమ్మవార్లలకు హారతి నివేదన జరిపారు. ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చన చేశారు. స్వర్ణపుష్పార్చన దర్శనమూర్తులను అర్పించారు. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం, అలంకార సేవోత్సవాలు చేశారు. శివ సన్నిధిలో మహాశివుడిడి ఆరాధిస్తూ అభిషేకం, అర్చన చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.

ఘనంగా వత్ర పూజలు... యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వత్ర పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ.60,000 ఆదాయం సమకూరింది. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధ్దలతో పూజలు నిర్వహించారు. రూ.6,74,170 ఆదాయం... శ్రీవారి ఖజానాకు రూ.6,74,170 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 54,210, 100 రూపాయల టిక్కెట్‌తో రూ. 45,600, కల్యాణకట్ట ద్వారా రూ. 24,200 గదులు విచారణ శాఖతో రూ. 70,300 ప్రసాదవిక్రయాలతో రూ.2,94,005, శాశ్వత పూజలతో రూ.22,116 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...