పరిషత్ సమావేశమా..? పార్టీ మీటింగా..?


Thu,April 18, 2019 12:45 AM

మునుగోడు : మండల సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధులు కాని వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోవడం చర్చనీయాంశమైంది. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఉదయం 11గంటలకు ప్రారంభమైంది. కాగా, సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు హాజరయ్యారు. 12.25గంటలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. కాగా ఎమ్మెల్యేతోపాటు అక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కొంతమంది మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు దర్జాగా సమావేశంలో కూర్చున్నారు. అందరూ ఈ విషయాన్ని గమనించినా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. సమావేశంలోకి వచ్చేందుకు అర్హత లేనివారు రావడం, అది కూడా ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు రావడంపై ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నవారు ఇతరులను సమావేశంలోకి ఎలా తీసుకొస్తారని, అసెంబ్లీలోకి కూడా కార్యకర్తలను తీసుకెళ్తారా అని ప్రశ్నిస్తున్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...