నేడు టీఎస్ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు


Thu,April 18, 2019 12:45 AM

- జిల్లా కేంద్రంలో 25పరీక్ష కేంద్రాలు
- హాజరుకానున్న 6,033మంది విద్యార్థులు
- డీఈఓ సరోజినీదేవి

రామగిరి : నల్లగొండ జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష-2019 6వ తరగతి నుంచి 10తరగతిలో ప్రవేశానికి ఈ నెల 18న వేర్వేరుగా జరిగే పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ సరోజినీదేవి తెలిపారు. దీనిలో భాగంగా 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గం. వరకు పరీక్ష జరుగనుండగా వీరికి 14పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 3,353మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అదే విధంగా మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు 7నుంచి 10వ తరగతులకు పరీక్ష జరుగుతుండగా వీరికి 11పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,680మంది విద్యార్థులు (7వ తరగతికి 1,133, 8వతరగతికి 898, 9వతరగతి-500, 10వతరగతి-149మంది విద్యార్థులు) హాజరవుతున్నట్లు డీఈఓ సరోజినీదేవి, జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ విజయభారతీ వెల్లడించారు. ఇప్పటికీ హాల్‌టికెట్స్ అందని విద్యార్థులు telanganams.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...