మైనార్టీ గురుకులాల్లో ప్రవేశానికి ఈ నెల 20న పరీక్ష


Thu,April 18, 2019 12:45 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ : ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశ పరీక్ష ద్వారా ఆన్‌లైన్‌లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 20న ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మైనార్టీ సంక్షేమశాఖాధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలో మైనార్టీ గురుకుల పాఠశాల బాలురు ఎస్‌ఎల్‌బీసీ, మిర్యాలగూడలో బాలికల పాఠశాల సీతారామపురం, నకిరేకల్‌లో బాలికల పాఠశాల ఆఫీసర్స్‌కాలనీ, దేవరకొండలో బాలుర పాఠశాల కొండమల్లేపల్లిరోడ్డు, నిడమనూరు పరిధిలోని ఖతీజా ఖతున్ కళాశాల వేంపాడ్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. హాజరు కానున్న విద్యార్థులు హాల్ టికెట్లతో గంట ముందే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలన్నారు. అదనపు వివరాల కోసం మైనార్టీ గురుకుల పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ ఎస్‌ఎల్‌బీసీ నల్లగొండ సెల్ నెం.9949028733, దేవరకొండ-7331170859, మిర్యాలగూడ-7331170855, నిడమనూరు-7995057975, నకిరేకల్-7995057939 నెంబర్లను సంప్రదించాలన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...