ఉలిక్కిపడ్డ నాయకుని తండా


Tue,April 16, 2019 02:39 AM

- టీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడి
- సుమారు 30 ఇండ్లు ధ్వంసం
- పలువురికి గాయాలు
- తండాలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు

తిరుమలగిరి (సాగర్): మండలంలోని నాయకునితండాలో టీఆర్‌ఎస్ నాయకుల ఇండ్లపై ఆదివారం రాత్రి కాంగ్రెస్ నాయకులు దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మండలంలోని సపావత్‌తండాకు చెందిన సపావత్ మంగ్తానాయక్ (80)అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, మంగ్తానాయక్ ఇంటికి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన మేరావత్ సకృనాయక్ అతడి అన్న మేరావత్ స్వామి, టీఆర్‌ఎస్ నాయకులు కుర్ర స్వామి, మేరావత్ గన్యానాయక్, జర్పుల రవి, కాంగ్రెస్ పార్టీ నుంచి మేరావత్ బిచ్చాలు, మేరావత్ సేవాలు వెళ్లారు. దీంతో అక్కడ టీఆర్‌ఎస్ నాయకులతో కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ ఎన్నికల పోటీల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి సకృనాయక్ ఓడిపోవడంతో మీరు మాతో సమానంగా ఉండకూడదని వారిని అవహేళన చేశారు. సపావత్‌తండాలో మంగ్తానాయక్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత నాయకునితండాకు వచ్చారు. టీఆర్‌ఎస్‌కు చెందిన మేరావత్ స్వామినాయక్ ఇంటికి వచ్చి తన కొడుకు దత్తుకు జరిగిన విషయాన్ని చెప్పాడు.

దీంతో దత్తు కాంగ్రెస్ పార్టీకి చెందిన మేరావత్ సేవానాయక్ ఇంటికి వెళ్లి మా నాన్నకు ఎందుకు అవహేళన చేశావని అడిగాడు. దీంతో దత్తుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో గ్రామంలో ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిసింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్‌ఎస్ నాయకుల ఇళ్లపై సుమారు 10 జిలెటిన్‌స్టిక్స్ తూటాలను ఉపయోగించి, రాళ్లు, కర్రలు, బీరుసీసాలతో దాడులు చేశారు. ఇండ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇరువర్గాలకు చెందిన సుమారు 30ఇండ్లు ధ్వంసమయ్యాయి. సుమారు రూ.30 లక్షల ఆస్థినష్టం వాటిల్లింది. దీంతో పాటు మేరావత్ సోమ, మేరావత్ నాగులు తలకు తీవ్ర గాయాలు కాగా, మూడావత్ దస్లీకి కంటికి, మేరావత్ సాలికి కాలికి గాయం కావడంతో నాగార్జునసాగర్ కమలానెహ్రూ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. తండాలో సాగర్ సీఐ వేణుగోపాల్, హాలియా సీఐ ధనుంజయ్యగౌడ్, ఎస్‌ఐలు కురుమయ్య, శీనయ్య, వీరరాఘవులు, యాదయ్యలతో పాటు 20 మంది పోలీస్ సిబ్బందితో పికెటింగ్ నిర్వహించారు. తిరుమలగిరి ఎస్‌ఐ చెన్నమోని కురుమయ్య ఆధ్వర్యంలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అమానుషంగా మాపై దాడులు చేసి మా ఇండ్లను పూర్తిగా ధ్వంసం చేశా రు. కర్రలతో, బీరు సీసాలతో, తూటాల తో మా ఇండ్లపై దాడులు చేసి మమ్మల్ని భయాబ్రాంతులకు గురి చేశారు. మా ఇంటి యజమానులను ఇంటి నుంచి తరిమికొట్టారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలి.
- మేరావత్ శారద, నాయకునితండా

పోలీసుల వైఫల్యం వల్లనే...
ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఏకదాటిగా వరుస దాడులు జరిగినప్పుడు పోలీసులు వచ్చారు. దాడులను ఆపకపోవడంతోనే ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. మా ఇంట్లో వంట పాత్రలను కూడా ధ్వంసం చేశారు.
- మేరావత్ హనిమి, నాయకునితండా

195
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...