ఉద్యమంలో మోహన్‌రావుది క్రియాశీలక పాత్ర


Tue,April 16, 2019 02:36 AM

నీలగిరి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యోగులను మమే కం చేయడంతోపాటు క్రీయాశీలక పాత్రను మోహన్‌రావు పోషించారని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ క్రీడలు, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం ఎంపీడీఓల సంఘం, టీజీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు గోనె మోహన్‌రావు ఉద్యోగ విరమణ సన్మానసభ చిన్నవెంకటరెడ్డి పంక్షన్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మోహన్‌రావు దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ కోపం తెలియని వ్యక్తి, సమస్యలను వెంటనే పరిష్కారం చతురత కలిగిన వ్యక్తి మోహన్‌రావని కొనియాడారు. గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా , ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందిస్తూనే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఉద్యోగులను సంఘటితం చేయడంలో ఆయనపాత్ర ఎనలేనిదన్నారు. మంచి పరిపాలన కోసమే తెలంగాణ ను తెచ్చుకున్నామని, దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతుందన్నారు. సమైకాంధ్ర పాలనలో నల్లగొండ ఎంతో నష్టపోయిందని, నష్టపోయిన నల్లగొండను అభివృద్ధి చేసుకునేందుకు మేధావులంతా ఏకమై ప్రభుత్వంతో కలిసి మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తు బంగారుతెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తుందన్నారు. మోహన్‌రావు శేష జీవితం ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్థిల్లాలని కోరారు.

ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి వస్తే సముచిత స్థానం కల్పించి మోహన్‌రావు సేవలు పొందుతామని తెలిపారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల్లో అందరికి తలలో నాలుకలా ఉంటూ ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తు మరో పక్క తెలంగాణ గెజిటెడ్ సంఘం, ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి గొప్ప పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి మోహన్‌రావు అని కొనియాడారు. జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ మాట్లాడుతూ మోహన్‌రావు ఎంతటి జఠిలమైన సమస్యను కూడా చాలా సున్నితంగా పరిష్కరించేవారని కొనియాడారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మృదుస్వభావి, కోపం తెలియని వ్యక్తి మోహన్‌రావని అన్నారు. ఉద్యోగ బాధ్యతల్లో చిన్న మచ్చ కూడా తెచ్చుకోకుండా పని చేసిన ఆదర్శ అధికారి అని కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓస్, టీజీఓస్, అధికారులు దేవ్‌సింగ్, శ్రీనివాసమూర్తి, ఏపాల సత్యనారాయణరెడ్డి, మామిడాల రమేష్, పందిరి వెంకటేశ్వరమూర్తి, జి.వెంకటేశ్వర్లు, గోలి అమరేందర్‌రెడ్డి, కర్నాటి విజయ్‌కుమార్, పొనుగోటి చొక్కారావు, గోనె విష్ణువర్ధన్‌రావు, శేఖర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, డీఐ రాజు, మందడి ఉపేందర్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, నర్సింహాచారి, అయిటిపాముల విశ్వేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ మేధావి అంబేద్కర్
ఎంజీయూనివర్సిటీ: డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలనే నేడు అనుభవిస్తున్నామని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ॥ ఎం. యాదగిరి అన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నల్లగొండలోని ఎంజీయూ ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మందిరంలో యూనివర్సిటీ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ, విద్యార్థుల ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. దురదృష్టవశాత్తు అంబేద్కర్‌ను ఒక సమాజానికి సంబంధించిన వారిగా పరిమితి చేయరాదని తెలిపారు. ఆయన రాసిన రాజ్యాంగం నేడు మనం ఆచరిస్తున్నామని తెలిపారు. విశిష్టఅతిథిగా హాజరైన ప్రముఖ గాయకుడు, సినీ గేయరచయిత జయరాజ్ హాజరై మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలో ఉన్న ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని తన విద్యను కొనసాగించి సమాజానికి జ్ఞానాన్ని పంచారన్నారు. నైతిక విలువలను, సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలన్నారు. అంబేద్కర్ ఆశయస్ఫూర్తితో విద్యార్థులు జీవితంలో స్థిరపడాలని కోరారు. ప్రభుత్వ మహిళా కళాశాల తెలుగు విభాగాధిపతి డా.కోయి కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆయన చేసిన సేవలను వివరించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. దేశంలో కులమతాలను తొలగించి సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడని కీర్తించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు, ఎంజీ యూ కామర్స్ అండ్ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.సరిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ ఆడిట్‌సెల్ డా.అల్వాల రవి, అసిస్టెంట్ ప్రొ॥ డా.కె. మాధురి, స్టూడెంట్ వెల్ఫేరాఫీసర్ ఎల్.మధు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...