నేడే రాములోరి కల్యాణం


Sun,April 14, 2019 02:03 AM

నల్లగొండకల్చరల్:శ్రీరామనవమి వేడుకలో భాగంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించేందుకు ఆలయాలను ముస్తాబు చేశారు. పలు దేవాలయాల్లో శనివారం రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోళ్ల ఘట్టాలను అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. నల్లగొండలో రామగిరిలో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాన్ని సర్వంగ సుంద రంగా తీర్చిదిద్దారు. కల్యాణ వేదికలను ప్రత్యేక అలంకరణ చేయడంతో పాటు విద్యుత్ దీపాలంకరణలు చేయడంతో నయనాందనకరంగా దర్శనమిస్తున్నాయి. వాడవాడలా కల్యాణోత్సవం ఆదివారం జరుగనుంది.

పితృవాక్య పరిపాలకుడు శ్రీరాముడు
పితృవాక్య పరిపాలకుడు శ్రీరాముడు. సకల గుణాభిరాముడు అని పిలువబడే రాములవారి కల్యాణోత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. చైత్రశుద్ధ నవమి నాడే శ్రీరాములవారి వివాహం సీతాదేవితో జరిగినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా నేడు జిల్లా వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు నల్లగొండలోని రామగిరిలో రెండో భద్రాద్రిగా పేరు గాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంతో పాటు వాడవాడలా సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవం గా జరుగనుంది.

నవమి వేడుక ఇలా..
శ్రీరాముడు తేత్రా యుగంలో వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో అజిత్ ముహుర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. రాముడి జన్మదినాన్ని ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. పితృవాక్య ఆదేశాల మేరకు 14 ఏళ్లు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు, సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది. ఈ శుభ ఘడియ కూడా చైత్ర శుద్ధనవమినాడే జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి. అందువల్లే ఇదే ముహుర్తంలో సీతారాముల కల్యాణం కూడా ఇదే రోజున జరిగింది. ఇలా ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణోత్సవ వేడుక నిర్వహిస్తున్నారు.

భద్రాద్రి నుంచి తలంబ్రాలు
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నల్లగొండలో రెండో భద్రాద్రిగా పేరు గాంచిన రామగిరి లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల తిరుకల్యాణోత్సవం జరుగనుంది. భద్రాచలం దేవస్థానం నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను అధికారికంగా ఉదయం 9 గంటలకు వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య జిల్లా కలెక్టర్ డా॥ గౌరవ్ ఉప్పల్ సమర్పించనున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నివాసం నుంచి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు తీసుకరానున్నట్లు ఆలయ ఈఓ మొకిరాల రాజేశ్వరశర్మ తెలిపారు. అనంతరం ఉదయం 10 గంటలకు సీతారామచంద్రస్వామి కల్యాణ ఘట్టం ప్రారంభమై 12 గంటలకు కల్యాణోత్సవం వేడుక జరుగుతుంది.

మౌళిక వసతులు..
వేసవిని దృష్టిలో ఉంచుకుని రాములోరి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఇబ్బంది కలుగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవం తిలకించేందుకు ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. తాగునీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను దాతల సహకారంతో అందజేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. అదే విధంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జిల్లా అ గ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేశారు. నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చర్యలు తీసుకుని సమీక్షలు జరిపారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...