ఈవీఎంలు భద్రం


Sat,April 13, 2019 06:11 AM

-పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్‌రూమ్‌కు తరలింపు
-కేంద్ర పారామిలటరీ బలగాల పహారా
- పర్యవేక్షించిన ఇరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు
నీలగిరి: నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి గురువారం ఎన్నికలు నిర్వహించిన అనంతరం అసెంబ్ల్లీ నియోజక వర్గాల్లోని రిసెప్షన్ సెంటర్ల నుంచి ఈవీఎంలను, పోలింగ్ సామగ్రిని శుక్రవారం పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. ప్రత్యేకంగా నియమించిన కేంద్ర పారా మిలటరీ బలగాల బందోబ స్తు, సెక్టార్ అధికారుల సమక్షంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నియోజక వర్గాల సెంటర్ల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో కలెక్టర్ గౌరవ్ ఉప్ప ల్, ఎస్పీ రంగనాథ్, సూర్యాపే ట కలెక్టర్ అమామ్‌కుమార్, సూర్యాపేట ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్‌రావు ఎన్నికల సాధారణ పరిశీలకులు దనుంజయదేవాంగన్, పోలీస్ నోడల్ అధికారుల సమక్షంలో భద్రపరిచారు. గోదాంలో నియోజక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో వాటి ని భద్రపరిచి సీల్‌వేశారు.స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంల భద్రతకు, అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు, వర్షం పడిన ఇబ్బంది లేకుండా అన్ని రకాల భద్రత రక్షణ చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. మే 23న కౌంటింగ్ జరగనున్నందున అప్పటివరకు పటిష్ట భద్రత, బందోబస్తుకు సీఆర్‌పీఎఫ్ కేంద్ర రక్షణ బలగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో రవీంద్రనాథ్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, నోడల్ అధికారులు శ్రీనివాసమూర్తి, రాజ్‌కుమార్, గంగారామ్, సీపీఎం ఎంపీ అభ్యర్థి మల్లు లక్ష్మీ, ఇతర పార్టీల అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల ర్యాండం...
గురువారం జరిగిన నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం కౌంటింగ్ కేంద్రానికి తీసుకొచ్చిన ఈవీఎంల అనంతరం అత్యధికంగా పోలింగ్ జరిగిన, అత్యల్పంగా పోలింగ్ జరిగిన పోలింగ్ స్టేషన్ల 17 సీపీఓ డైరీ, ఇతర పోలింగ్ దృవ పత్రాలను పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్కూటిని కార్యక్రమాన్ని ఎన్నికల అధికారి కలెక్టర్ గౌర వ్ ఉప్పల్ , సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమమ్‌కుమార్, సాధారణ ఎన్నికల పరిశీలకులు ధనుంజయ్‌దేవాంగన్‌తో కలిసి నిర్వహించారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...