నేటి నుంచి వేసవి సెలవులు


Sat,April 13, 2019 06:10 AM

సూర్యాపేట అర్బన్ : పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 13వ తేదీ నుంచి మే 31వ వరకు వేసవి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులు ఇప్పటి వరకు పుస్తకాలతో కుస్తీలు పట్టిన వారు వేసవిలో వివిధ విహార యాత్రలకు, బంధువుల ఇళ్లలోకి వెళ్లి సరదాగా గడపనున్నారు. జిల్లాలో అన్ని రకాల మేనేజ్‌మెంట్ల కింద 1,289 పాఠశాలలు ఉండగా అందులో 1,41,820మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి వేసవి సెలవులు ఇచ్చారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు వేడిమి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పని పరిప్థితుల్లో విద్యార్థులు ఎండలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి కనుక వస్తే తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
జిల్లాలో ఉన్న అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలల వారు వేసవి సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు వేసవి సెలవుల్లో వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో బటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాఠశాల తిరిగి జూన్ 1న పునఃప్రారంభమవుతుందని తెలిపారు.
- మదన్‌మోహన్, ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారి, సూర్యాపేట

212
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...