గులాబీ శ్రేణులకు కృతజ్ఞతలు


Sat,April 13, 2019 06:09 AM

రామగిరి: లోక్‌సభ ఎన్నికల్లో తన తరుపున ప్రచారం కోసం శ్రమించిన గులాబీ శ్రేణులకు టీఆర్‌ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ప్రచార బాధ్యతలను భుజస్కందాలపైన వేసుకుని ప్రచారం నిర్వహించిన విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తన విజయాన్ని కాంక్షిస్తూ శ్రమించిన శాసన సభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో పాటు పార్టీ పరిశీలకుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతోపాటు ప్రజా సంఘాలకు, ప్రజా నాయకులకు, ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...