16 స్థానాలు గెలవడం ఖాయం


Sat,April 13, 2019 06:09 AM

కొండమల్లేపల్లి: టీఆర్‌ఎస్ పదహారు స్థానాల్లో గెలుస్తుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ 16 సీట్లను సాధించి నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లలో డిపాజిట్లు కోల్పోతుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు కూడా లేని పరిస్థితుల్లో పోలిం గ్ కంటే ముందే చేతులెత్తేశారన్నారు. ఎండల తీవ్రతతోపాటు 20 సంవత్సరాల తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించి వేర్వేరుగా ఎన్నికలు రావడంతో పోలిం గ్‌శాతం పడిపోయిందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో కరువు ప్రభావంతో వలసలు వెళ్లారని వీలైనంతవరకు ఓటర్లను రప్పించామన్నారు. రైతుబంధు పథకంలో రూ.4 వేల 5 వందల కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని మిగతా ఎనిమిది వందల కోట్లు కొంత ఆలస్యం జరిగిందని, రైతులు, యువత, మహిళలు పెద్ద ఎత్తు న టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారన్నారు. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సిం హారెడ్డి లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, కేసాని లింగారెడ్డి, తిరందాసు కృష్ణయ్య, ఎలిమినేటి సాయి, పస్నూరీ యుగేంధర్‌రెడ్డి, అబ్బనబోయిన శ్రీనివాస్‌యాదవ్, రమావత్ దస్రూనాయక్, మాడ్గుల యాదగిరి, వస్కుల కాశయ్య, కైలాసం, నాగవరం రాజు, బావండ్ల దుర్గయ్య, మధుసూదన్ రెడ్డి, ఖాదర్, బొడిగె శంకర్, ముత్యపురావు, వెంకటేశ్వర్‌రావు తదితరులున్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...