తగ్గిన పోలింగ్


Fri,April 12, 2019 01:24 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే ప్రస్తు త పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. గురువారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచే జిల్లాలో ఉత్సాహంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 7 గంటల నుంచే ఓట ర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. 8 గంటల సమయానికే ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలోనూ ఓటర్లు భారీగా బా రులు తీరారు. 11గంటల వరకూ ఈ తీవ్రత కొనసాగింది. మధ్యాహ్నం పోలింగ్ శాతం కొంత మేర మందగించినా.. సాయంత్రం మళ్లీ పోటెత్తింది. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే తరహా పోలింగ్ సరళి కొనసాగింది. గత ఎ న్నికలతో పోల్చినపుడు తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుందనే విశ్లేషణలు ఆయా రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ప్రారంభమైంది.

ఉదయం నుంచే ఉత్సాహంగా మొదలైన పోలింగ్...
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉదయం నుంచే పోలింగ్ ఉత్సాహంగా కొనసాగింది. 11 గంటల వరకు మొత్తం 26.49 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1గంట వరకు 42.09 శాతం.. 3 గంటల వరకు మొత్తం 58.21 శాతం ఓట్లు నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలో నమోదయ్యాయి. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉదయం 11 గంటల వరకు 26.95 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. మధ్యాహ్నం 1గంట వరకు 40.99 శాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో మొత్తం 57.41 శాతం పోలింగ్ జరిగింది. ప్రతీ రెండు గంటలకు 10 శాతం చొప్పున రెండు స్థానాల్లోనూ పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...