16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం


Fri,April 12, 2019 01:24 AM

అర్వపల్లి : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ 16ఎంపీ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలకేంద్రంలోని పోలింగ్‌కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధ్దిని కోరుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధ్ది సాధ్యమవుతుందని ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారని అన్నారు. 16ఎంపీలతో కేంద్రంలో వచ్చే ప్రభుత్వంతో పోరాడి తెలంగాణకు అత్యధిక నిధులను తీసుకువచ్చే సత్తా సీఎం కేసీఆర్‌కు ఉందన్నారు. వచ్చే ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధించి పూర్తిచేసి తీరుతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్తితో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. గోదావరి నీటిని రెండు పంటలకు ఇచ్చితీరుతామని స్పష్టం చేశారు. మంత్రి వెంట అర్వపల్లి ఎంపీపీ దావుల మనీషావీరప్రసాద్, స్థానిక సర్పంచ్ బైరబోయిన సునీతారామలింగయ్య, టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...