ప్రాణం తీసిన కరెంట్ తీగలు


Fri,April 12, 2019 01:24 AM

నాగారం/డిండి: సూర్యాపేట, నల్లగొండ జిల్లా లో గురువారం విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా నాగారం బంగ్లాలో రైతు గడ్డి ఎదురుతుండగా తెగిపడిన విద్యుత్ తీగ లు తగిలి మృతి చెందాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం రహమంతాపూర్ గ్రామానికి చెందిన వివాహిత దండెంపై టవల్ ఆరవేస్తుండగా విద్యుదాఘానికి గురై ప్రాణాలు కో ల్పో యింది. వివరాలివి.. సూర్యాపేట జిల్లాలోని నాగారం మం డలం నాగారం బంగ్లా గ్రా మానికి చెందిన కన్నెబోయిన యాద య్య(50) పొలం కోసిన గడ్డి ఎదురుతున్నాడు. ఈదురుగాలుల ఉధృతికి బోరు వద్ద విద్యుత్ తీగ పడిపోయింది. గమనించక గడ్డి ఎదురుతుండగా చేతికి తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ఎం.లింగం, ఆర్‌ఐ వహీ ద్ పరిశీలించి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభు త్వ దవాఖానకు తరలించారు. పెద్దదిక్కును కో ల్పోవడంతో కుటుంబసభ్యులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

డిండిలో మహిళ..
డిండి మండలం రహమంతాపూర్‌కు చెందిన పెంటమళ్ల చెన్న కిష్టమ్మ(45) ఉదయం స్నానం చేసి ఇంటి ఆవరణలో జీఐ తీగతో కట్టిన దండెం పై తువ్వాలు ఆరవేస్తుండగా ఇంట్లోని విద్యుత్ వైరు తీగకు తగిలి సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త చెన్నయ్య ఫిర్యాధు మేరకు రెవెన్యూ అధికారి పుల్లయ్య పంచనామా నిర్వహించారు.

201
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...