నేడే పోలింగ్


Thu,April 11, 2019 12:59 AM

- సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం
- ఓటు హక్కు వినియోగించుకో నున్న 15,85,433ఓటర్లు
- పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో తరలిన సిబ్బంది
- ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్
- 1997 పోలింగ్ కేంద్రాలు.. 215సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు
- 4902బ్యాలెట్ యూనిట్లు, 2723వీవీ ప్యాట్‌ల వినియోగం

నల్లగొండ, నమస్తేతెలంగాణ : పార్లమెంట్ సాధారణ ఎన్నికలు నేడు(గురువారం)జరుగనున్నాయి. ఇందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు పోలింగ్ నిర్వహిస్తారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 15,85,433మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పటిష్టమైన బందోబస్తుతోపాటు అన్నిరకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. 215 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి 4వేల మంది కేంద్ర, రాష్ట్ర పోలీస్‌బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సుమారు 10వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. బుధవారం ఉదయమే ఎన్నికల సిబ్బంది ఆర్‌ఓ కార్యాలయంలో రిపోర్టు చేసి అక్కడే ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్ నుంచి ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీ

ప్యాట్లతో పల్లెలకు చేరారు.
ఎన్నికల పరిశీలకుల సూచనలు, సలహాలు తీసుకుంటూ జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 27మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మద్యం, డబ్బు అరికట్టడానికి మోడల్ కోడ్ అమలుకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎంసీసీ ైప్లెయింగ్ స్క్యాడ్స్, ఎస్‌ఎస్‌టీ వీడియో సర్వేలైన్స్ ఇతరత్రా 73టీంలు ఏర్పాటు చేశారు. 15, 85,433 మంది ఓటర్లలో 7,84,111పురుషులు 8,01,295 స్త్రీలు, 27ఇతరులు ఉన్నారు. వీరు కాకుండా మరో 547మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు 1997పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్‌ను కేటాయించారు. ప్రతి నియోజకవర్గంలో 15శాతం అదనంగా వాటిని అందుబాటులో ఉంచారు. పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 4902బ్యాలెట్ యూనిట్లు, 2501కంట్రోల్ యూనిట్లు, 2723వీవీ ప్యాట్‌లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. కాగా, ఈ సంవత్సరం అదనంగా 20పోలింగ్ కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేశారు.

రూ.2.09 కోట్ల నగదు, 19,755 లీటర్ల లిక్కర్ సీజ్..
నల్లగొండ, సూర్యాపేల జిల్లాల పరిధిలో తొమ్మిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం, డబ్బు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. అంతర్‌రాష్ట్ర సరిహద్దులైన వాడపల్లి, విజయపురి సౌత్, కోదాడ వద్ద రాష్ట్రస్థాయి చెక్‌పోస్టులు, అంతర్‌జిల్లా సరిహద్దులైన కేతేపల్లి మండలం కొర్లపహాడ్, చిట్యాల మండలం గుండ్రాంపల్లి, దేవరకొండ మండలం చింతపల్లి, మిర్యాలగూడ మండలం ఆలగడపలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అమర్చారు. ఫిర్యాదులు చేసేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 08682 221300, టోల్‌ఫ్రీ నెంబర్ 18004251442 ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రూ.2కోట్ల9లక్షల65వేల నగదు, అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 242మందిపై 362కేసులు నమోదు చేసి 19,755 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేశారు. వీటితోపాటు 239బెల్టుషాపులను మూసివేశారు. 263మంది నుంచి లైసెన్స్ గన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ కేసుల కింద 14,911మందిని బైండోవర్ చేశారు.

215 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు...
పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 215పోలింగ్ కేంద్రాలను అతిసమస్యాత్మక కేంద్రాలుగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో మైక్రోఅబ్జర్వర్, వెబ్‌కాస్టింగ్, మొబైల్ టీం(లైవ్ టెలికాస్ట్)ను ఏర్పాటు చేశారు. సిగ్నల్ తక్కువగా ఉన్నచోట వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలు, రాజస్థాన్ ఇతర రాష్ర్టాల బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 36ైస్ట్రెకింగ్ ఫోర్స్, 8స్పెషల్ ైస్ట్రెకింగ్ ఫోర్స్, 160రూట్లలో రూట్ మొబైల్స్ శాంతిభద్రతల పరిరక్షణకు మొత్తం 4వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది..
నేటి ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, కంట్రోల్ యూనిట్లు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరి ఏర్పాట్లు చేసుకున్నారు. పోలింగ్ సిబ్బంది వెంట పోలీసులు సైతం వచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నల్లగొండ జిల్లాలో నాలుగు, సూర్యాపేట జిల్లాలో మూడు నియోజకవర్గాలను 160రూట్‌లుగా విభజించారు. పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేర్చేందుకు 145బస్సులను ఏర్పాటు చేశారు.

నూరు శాతం లక్ష్యంగా ..
జిల్లాలో పోలింగ్ శాతం నూరు శాతం నమోదు లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. ఎన్నికలకు దూరంగా ఉంటున్న దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు ఓటు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించి తిరిగి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసింది. మహిళలు పోలింగ్ విధులు నిర్వహించే చోట సఖీ బూత్ పేరున 7అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 పోలింగ్‌బూత్‌లు, ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా 4,700వీల్ చైర్స్, ఆటోలు ఏర్పాటు చేశారు.

138
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...