నేడే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు


Tue,March 26, 2019 01:25 AM

- దుప్పలపల్లి వద్ద గిడ్డంగుల సంస్థ గోదాంలో కౌంటింగ్
- మూడు జిల్లాలకు 14 టేబుళ్ల ఏర్పాటు
- బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు

రామగిరి/నేరేడుచర్ల: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజవర్గ శాసనమండలి స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగనుండగా జిల్లా యంత్రంగం సర్వం సిద్ధం చేసింది. మూడు జిల్లాల ఓటర్లు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉం ది. అయితే బరిలో తొమ్మిది మంది అభ్యర్థులుండగా ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ ఉండే అవకాశం ఉం టుందిని ఓటర్లు, ఉపాధ్యాయ నేతలతోపాటు విశ్లేషకు లు వెల్లడిస్తున్నారు. నల్లగొండలోని దుప్పలపల్లి వద్ద గల రాష్ట్ర గిడంగుల సంస్థ్ధ గోదాముల్లో కౌటింగ్ ప్రక్రియకు మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేసి లెక్కింపుకు 130 మంది సిబ్బందిని నియమించారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గం ఫలితాల కోసం అధికార యం త్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నల్లగొండ జిల్లా కేం ద్రంలోని దుప్పలపల్లి వద్దగల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ్ధ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన సం గతి తెలిసిందే. మొత్తం మూడు జిల్లాల్లో కలిపి 20,888 మంది ఓటర్లకుగానూ 28,886 ఓట్లు పోలై న విషయం విది తమే.

మంగళవారం కౌటింగ్ కేంద్రానికి లెక్కింపు సిబ్బంది ఉదయం 6గం.లకే చేరుకొనుండగా అయితే కౌటింగ్ ప్రక్రియ మాత్రం ఉదయం 8గంటలకు ప్రా రంభమవుతుంది. తొలుత అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌లను ఓపెన్ చేసి ఆయా కేంద్రాల పీఓలు అందచేసిన పత్రాల్లోని ఓట్ల సంఖ్యకు బ్యాలెట్ బాక్స్‌లోని ఉన్న ఓట్లు(బ్యాలెట్ పేపర్స్) సంఖ్య సరిగ్గా ఉందా లేదా అనేది పరిశీలిస్తారు. మొత్తం 185 పోలింగ్ కేంద్రాల నుంచి తీసుకొచ్చిన బ్యాలెట్ బాక్సులను ముందుగా ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ బాక్స్‌లను అన్నింటిని తెలిరిచి తర్వత 50 పత్రాలు(బ్యాలెట్ పేపర్స్) కలిపి ఒక్క బండిల్(కట్టా)గా కడుతారు. మూడు జిల్లాలకూ కలిపి మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. తర్వాత 50 ఓట్లతో కూడిన అన్ని బండిళ్లను పెద్ద డ్రమ్ములో వేసి మిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఒక్కో టేబుల్‌కు 500 బ్యాలె ట్ పత్రాల చొప్పున అంటే ప్రతీ టేబుల్‌కు 10 ఓట్ల కట్టలను పంచుతారు. అంటే ఒక్క రౌండ్‌లో 7000 వేల ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంది. అయితే లెక్కిం పు ప్రక్రియకు సంబంధించిన విషయం అంతా రిటర్నింగ్ అధికారి అదేశాలపైనే ఆధారపడి ఉంటుంది. ముందుగా 14 టేబుళ్ల నుంచీ ఆయా అభ్యర్థ్ధులకు వచ్చిన తొలి ప్రాధాన్యతా ఓట్లను.. చెల్లుబాటు కాని ఓట్లను వేరుగా చేసి లెక్కిస్తారు. ఇలా మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు తొలి ప్రాధాన్య తా ఓట్ల లెక్కింపును పూర్తి చేస్తారు. అప్పుడే ఎన్ని ఓట్లు విజయానికి అవసరమో స్పష్ట వస్తుంది. దానిలో 50 శాతం కంటే అధికంగా ఒక్క ఓటు ఎవ్వరికి ప్రాధనత్య క్రమం లో వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు.

తొలి ప్రాధాన్యతా ఓట్లతో విజేత తేలకుంటే..
తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొత్తం చెల్లుబాటయ్యే ఓట్ల నుంచి యాభై శాతం కంటే ఒక్క ఓటు అధనంగా వచ్చినా.. ఆ అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. ఒకవేళ ఏ అభ్యర్థికీ యాభైశాతం ఓట్లు రాని పక్షంలో రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపుకు వెళతారు. ఇక్కడ మాత్రం పోటీ చేసిన అందరు అభ్యర్థ్ధుల్లో ఎవరికైతే తక్కువ తొలి ప్రాధాన్యతా ఓట్లు వస్తాయో.. వారి ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను ముందుగా లెక్కించి ఆ అభ్యర్థ్ధిని ఎలిమినేట్ చేస్తారు. తొలి ఓట్లలో చివరి స్థానంలో నిలిచిన అభ్యర్థికి పోలైన ద్వితీయ ఓట్లు.. ఏ అభ్యర్థులు పొందినవి వారికి కేటాయిస్తారు. ముం దుగా ఆయా అభ్యర్థులు పొందిన తొలి ప్రాధాన్యతా ఓట్లకు వీటిని జత చేస్తారు. ఇలా ఈ ఎలిమినేషన్ ప్రక్రియను చివరికి ఇద్దరు అభ్యర్దులు మాత్రమే మిగిలే వరకు నిర్వహిస్తారు. ఒకవేళ ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యతా ఓట్లకు ఆయా అభ్యర్థులు పొందిన ద్వితీ య ప్రాధాన్యతా ఓట్లను జత చేస్తుండగా.. ఏ దశలోనైనా ఒక అభ్యర్ధికి రెండు ఓట్లు కలిపి యాభై శాతం కం టే అధనంగా వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు.

తొలిదశలో తేలకుంటే..రెండోదశలో తేలే అవకాశం..
తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయినా విజేత తేలని పక్షంలో.. రెండో ప్రాధాన్యతా ఓట్లతో కచ్చితంగా ఎమ్మెల్సీగా ఎవరో ఒకరి గెలుపు ఖాయం అవుతుందనే అంచనా ఎన్నికల వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తృతీయ ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు వరకు వెళ్లిన సందర్భాలు తక్కువగానే ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.

లెక్కింపు ప్రక్రియకు ఇలా...
మూడు జిల్లాల్లో కలిపి మొత్తం పోలైన ఓట్లు 20,888. వీటిని మొత్తం తొలుత లెక్కిస్తారు. మొ త్తంలో ఓట్లు చెల్లుబాటు కానివి తీసి వేస్తారు. మిగిలిన చెల్లుబాట య్యే ఓట్ల సంఖ్య ...ఈ మొత్తం తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఏ అభ్యర్ధికైతే 50శాతం కంటే ఒక్క ఓటు అధనంగా వచ్చినా వారు విజేతగా నిలుస్తారు. ఒక వేళ ఏ అనే అభ్యర్థ్ధికి 50శాతం ఓట్ల కంటే అధికంగా ఒక్క ఓటు వీటిల్లోంచి తక్కువగా తొలి ఓట్లను పొందిన వారి ద్వితీ య ఓట్లను.. ప్రాధన్యత క్రమంలో ఎవరికి వచ్చినవి వారికి కేటాయిస్తారు. ముందుగా ఆయా అభ్యర్థులకు పొందిన తొలి ప్రాధాన్యతా ఓట్లను వాళ్లు పొందిన ద్వితీ య ఓట్లను కలుపుతారు. ఇలా చివరి నుంచి రెండు ఓట్లు కలుపుకుని అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థ్ధులు మాత్రమే మిగిలే వరకు లెక్కిస్తారు. ఈ క్రమంలో ఎక్కడైనా.. ఏ అభ్యర్ధికైతే రెండు ఓట్లు కలుపుకుని మొత్తం సంఖ్య 50శాతం కంటే అధిగమిస్తుందో వారిని విజేతగా తేలుస్తారు. ఇలా కూడా తేలని పక్షం లో మూడో ప్రాధాన్యతను సైతం ఎలిమినేషన్ పధఅధ్దతిలోనే లెక్కించే అవకాశం ఉంటుంది.

తేలనున్న 9 మంది భవితవ్యం...
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అతిపెద్ద ఉపాధ్యాయ సం ఘమైన పీఆర్టీయూ నుంచి పూల రవీందర్, యూటీఎఫ్ నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎస్‌టీయూ అనుబంధ సంఘాల నుంచి సంగని మల్లేశ్వర్, స్వతంత్ర అభ్యర్థులుగా పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పులి సరోత్తమ్‌రెడ్డి, విశ్రాంత డీఈఓ డా.ఏలె చంద్రమోహన్, విశ్రాంత ఉపాధ్యాయులు సురేష్, ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ వెంకటరాజయ్య, దుర్గం శివయ్య, వెంకటేశ్వ ర్లు పోటీలో ఉన్న విషయం విదితమే. అయితే వీరి భవితవ్యమంతా బ్యాలెట్ బాక్సుల్లోనే నిక్షిప్తమై ఉంది. కాగా ఎవరి అంచనాల్లో వారే మునిగి తేలుతున్నారు. గెలుపు ధీమాలపై వారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం. కాగా ప్రధాన పోటీ మాత్రం పూల రవీందర్, అల్గుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి మధ్యనే ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు చర్చించుకుంటున్నాయి.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...