ప్రభుత్వ కళాశాలల్లో బయోమెట్రిక్ అమలు చేయాలి


Tue,March 26, 2019 01:24 AM

ఎంజీయూనివర్సిటీ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవే టు కళాశాలల్లో ఇప్పటికే అధ్యాపకులు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తున్నామని ఆ తరహాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో సైతం తక్షణం బయోమెట్రిక్ మిషన్లను కొనుగోలు చేసి అమలుచేయాలని ఎంజీయూ వీసీ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సే న్ కోరారు. ఎంజీయూ ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలల సామర్థ్యాలను పెంచే బాధ్య త ప్రిన్సిపాళ్లదే అని పిన్సిపాళ్లు, సిబ్బంది ప్రత్యేకశ్రద్ధ్ద తీసుకోకపోవడంతోనే కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గు తూ వస్తుందని తెలిపారు. కళాశాలలపై సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలోనే కళాశాల విద్యకమిషనర్ ఆదేశాలను మాత్రమే మీరు పాటిస్తారా... వీసీ నిర్ణయాలు అమలుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వీసీ బయోమెట్రిక్‌ను అమలు చేయాలని సూచిస్తున్నారని కమిషనర్‌కు తెలియజేయాల్సిన బాధ్యత మీపైనా లేదా అని అంటూ ఉన్నత విద్యామండలి ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఇటు యూనివర్సిటీలు అటు కళాశాలలపై ఉందని గుర్తు చేశారు. ఏ కళాశాలల్లో నైతే విద్యార్థుల సంఖ్య 10లోపు ఉన్న కోర్సులను మూసివేయాల్సి ఉంటుందని ఆ పరిస్థితి రాకుం డా చూడాలన్నారు. ముఖ్యంగా హుజూర్‌నగర్, చం డూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సంఖ్య తక్కువగా ఉందని ఆ ప్రిన్సిపాళ్లు ప్రత్యేకశ్రద్ధ చూపి వచ్చే విద్యా సంవత్సరానికి సంఖ్య పెంచాలని తెలిపారు. ప్రభు త్వ కళాశాలలపై ఆధారపడి ఎంతోమంది పేద విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారని వారి శ్రేయస్సుకు అందరం కలిసి ముందుకు సాగి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చుదామని స్పష్టం చేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి, డైరెక్టర్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ సెల్ డా.అల్వాల రవి, అసిస్టెంట్ డైరెక్టర్ రామచంద్రం, సీఓఈ డా. మిర్యాల రమేష్, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...