కాంగ్రెస్ దివాలా..


Tue,March 26, 2019 01:23 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి,నమస్తేతెలంగాణ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్లగొండలో చెల్లని రూపాయిని తీసుకువచ్చి భువనగిరిలో నిలబెడుతున్నారన్నారు. భువనగిరి ప్రజలు చెల్లని రూపాయిని జేబులో పెట్టుకునేంత అమాయకులు కాదన్నారు. భువనగిరిలోనే కాకుండా రాష్ట్రమంతా కాంగ్రెస్‌ది ఇదే పరిస్థితి అన్నారు. 16 పార్లమెంట్ స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చేతిలో ఓడిపోయిన వారు, డిపాజిట్లు కోల్పోయిన వా రు 8 మంది ఇప్పుడు పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ అ భ్యర్థులుగా నిలబడ్డారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో కొందరు కాంగ్రెస్ నాయకులు కోతలు కోస్తున్నార ని, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ, జిల్లా ప్రజ లు కొట్టిన దెబ్బకు ఆ పార్టీ అడ్రస్ గల్లంతయ్యిందన్నారు. కొన ఊపిరితో ఉన్న ఒకరిద్దరు అవే మాటలు మా ట్లాడుతున్నారని చెప్పారు. కోమటిరెడ్డి సోదరులు కోతి వేషాలు, నిమిషానికో అబద్ధం, పూటకో అబద్ధం తప్ప జిల్లాకు చేసింది ఏమీ లేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనను ఓడిస్తాడని కోమటిరెడ్డి, కోమటిరెడ్డి తనను ఓడిస్తాడని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఒకరినొకరు ఆరోపించుకుంటున్నారని చెప్పారు. మీరిద్దరిని ఒకరిని ఒకరు మోసం చేసుకునే పనిలేదు.. ఓడించుకునే పనిలేదని.. ప్రజలు మిమ్మల్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో గాంధీభవన్‌కు తాళం పడటం ఖాయమన్నారు. ఒకప్పుడు టీఆర్‌ఎస్ గురించి అవాకులు చవాకులు మాట్లాడిన వారు నిన్న మొన్న వారి వారి కార్యాలయాలకు తాళం వేసుకున్నారన్నారు. 2001లో టీఆర్‌ఎస్ పెట్టిన నాడు పార్టీ నిలబడదు.. ఇలాంటివెన్నో చూశామని చంద్రబాబునాయుడు మాట్లాడారని చెప్పారు.

ఆనాడే పరేడ్‌గ్రౌండ్‌లో లక్షలాది మంది సాక్షిగా చంద్రబాబునాయుడికి అంత అహంకారం పనికిరాదని.. ఇప్పుడు చిన్నగా ఉన్న పార్టీ మహాసముద్రంగా మా రుతుంది. తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించుకుంటుందని, పార్టీ కార్యాలయం ఎన్‌టీఆర్ ట్రస్టు భవన్‌కు తాళం పెట్టుకోవాల్సి ఉం టుందని కేసీఆర్ హెచ్చరించారని గుర్తు చేశారు. అది ఇప్పుడు జరిగింది. చంద్రబాబునాయుడు ఈ మేరకు తెలంగాణలో పోటీ చేయబోమని ప్రకటించారని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి దేవాలయ అభివృద్ధితో పాటు, యాదాద్రి పవర్‌ప్లాంట్, దండుమల్కాపురంలో ఇండస్ట్రియల్ పా ర్కు, డ్రైపోర్టు ఇలా జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. కేవలం ఒకే సంవత్సరంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. కాంగ్రెస్ మో సాన్ని అర్థం చేసుకున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూ డిద భిక్షమయ్యగౌడ్ సైతం పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గాదరి కిశోర్,మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొల్పుల కమలాకర్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు తుం గబాలు, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతులు నాయక్, వైస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

151
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...