ముగిసిన నామినేషన్ల ప్రక్రియ


Tue,March 26, 2019 01:23 AM

నీలగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలుండగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాలను కలుపుకుని పార్లమెంట్ నియోజకవర్గం ఒకటే ఉంది. దీంతో నల్లగొండ జిల్లాలోనే నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియ నిర్వహిస్తుండడంతో జిల్లా కేంద్రంలోని అన్ని పార్టీల నాయకులు నామినేషన్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి నర్సింహారెడ్డి నామినేషన్ వేయగా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్ని తామై వ్యవహరించారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా పోటీలో ఉండడంతో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారమంతా ఆయనే చూసుకుంటున్నారు. సీపీఎం అభ్యర్థిగా మల్లు లక్ష్మీ నామినేషన్ దాఖలు చేయడంతో ఈ కార్యక్రమానికి పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. బీజేపీ అభ్యర్థిగా గార్లపాటి జితేంద్రకుమార్ నామినేషన్ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.లక్ష్మణ్ హాజరయ్యారు. వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు, పార్టీల నాయకులు కూడా నామినేషన్లను దాఖలు చేశారు.

చివరిరోజు 51 సెట్ల నామినేషన్లు...
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. చివరి రోజున పెద్ద ఎత్తున 51 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా 21, 23, 24 తేదీలలో సెలవులు రావడంతో నామినేషన్లను స్వీకరించలేదు. కేవలం నాలుగు రోజులు మాత్రమే నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రెండు రోజుల్లో 67 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 39 మంది అభ్యర్థులు 69 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.

నేడు పరిశీలన, 28 వరకు ఉపసంహరణ...
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా 39 మంది అభ్యర్థులు 69 సెట్ల నామినేషన్లను సోమవారం దాఖలు చేశారు. ఈ 69 సెట్ల నామినేషన్లను మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిశీలించనున్నారు. ఈ నెల 18 నుంచి 25 వరకు స్వీకరించినటువంటి నామినేషన్లలో అన్ని వివరాలను పరిశీలించి తప్పులున్నట్లయితే వాటిని తిరస్కరించనున్నారు. మిగిలిన నామినేషన్లలో అభ్యర్థులెవరైనా ఉపసంహరించుకోవాలంటే అందుకు గాను ఈ నెల 28 వరకు గడువు ఉన్నందున ఆలోపే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. మిగిలిన అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు ఏప్రిల్11న ఎన్నికలు నిర్వహించి మే 23న ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...