కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్‌దే కీలకపాత్ర


Mon,March 25, 2019 01:50 AM

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే (ఫెడరల్ ఫ్రంట్) కీలక పాత్ర ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఈ నెల 29న పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో ఆదివారం మిర్యాలగూడలో సభాస్థలిని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలకు సంబంధంలేని అంశాలను వారి ముందుకు తెచ్చి సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఉన్న వనరులను వినియోగించుకోవడంలో మూస పద్ధతులు పాటిస్తుండటంతో మోదీ గ్రాఫ్ తగ్గగా, ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌గాంధీ పూర్తిగా వైఫల్యం చెందాడన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశాన్ని ప్రాంతీయ పార్టీలే పాలిస్తాయన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసమస్యల పరిష్కారం, వనరుల వినియోగమే అజెండాగా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని, కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడే ఫ్రంట్ దేశానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందన్నారు. మంత్రి వెంట ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నల్లగొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి ప్రభాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, చిట్టిబాబునాయక్, శ్రీనివాస్‌రెడ్డి, పెద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...