రేపే ఎమ్మెల్సీ ఫలితం


Mon,March 25, 2019 01:49 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: ఈ నెల 22న జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సీ ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ చేపట్టనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. ఈ కౌంటింగ్ దుప్పలపల్లి గోడౌన్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా కౌంటింగ్ చేపట్టేందుకు నిర్వహించేటువంటి సూపర్‌వైజర్‌లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు రిహార్సల్స్ నిర్వహించారు. కౌంటింగ్ హాల్‌లో ఏర్పాట్లను సమీక్షించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ సకాలంలో ప్రారంభించాలని, పారదర్శకంగా, ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో 6 గంటలకే అందరూ చేరుకోవాలన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌లు, స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హాలుకు తరలించాలన్నారు.

కౌంటింగ్‌పై విశ్రాంత కార్యదర్శి సూచనలు
ఎంఎల్‌సీ ఎన్నికల కౌంటింగ్ విధానంపై ఎన్నికల సంఘం విశ్రాంత కార్యదర్శి చావలి రామబ్రహ్మం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు, ఎంఎల్‌సీ ఎన్నికల కౌంటింగ్‌కు తేడా ఉంటుందని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని ఈ ఎన్నికల్లో ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయనున్నందున క్రమాన్ని బట్టి ఫలితాలు వస్తాయన్నారు. మొదట పోలింగ్ స్టేషన్ల వారీగా బ్యాలెట్ బాక్సుల్లో పోలైన ఓట్ల మొత్తాన్ని లెక్కించి తర్వాత మొదటి ప్రాధాన్యతా క్రమం ప్రకారం అభ్యర్థ్ధి వారీగా ఓట్ల సంఖ్యను లెక్కిస్తారని, ఈక్రమంలో చెల్లుబాటు కాని ఓట్లను మినహాయించి చెల్లుబాటయ్యే ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపునకు కావల్సిన కోటాను నిర్ణయిస్తారన్నారు. ఒక వేళ మొదటి రౌండ్‌లో ఏదేని అభ్యర్థి కోటాకు కావల్సిన ఓట్లను పొందితే అతను గెలుపొందిన అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుందన్నారు. కావల్సిన ఓట్లు రాకపోతే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థ్ధిని తొలగింపచేసి అతడికి పోలైన ఓట్లను కొనసాగింపులో ఉన్న ఇతర అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమం ఆధారంగా పంపిణీ చేస్తామని అన్నారు. ఈ ప్రక్రియ ఏదైనా అభ్యర్థ్ధి కోటాకు కావల్సిన ఓట్లు పొందే వరకు లేనట్లయితే ఆఖరి అభ్యర్థి మినహా మిగతా అభ్యర్థులంతా తొలగింపడే వరకు కౌంటింగ్ కొనసాగనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ నిర్వహణతో పాటు కౌంటింగ్‌కు సంబంధించిన ఆయా రకాల ఫారాలను విధిగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ రవీంద్రనాథ్, సూర్యాపేట డీఆర్‌ఓ చంద్రయ్య, అసిస్టెంట్ కలెక్టర్ ఉదయ్‌కుమార్, ట్రెయినింగ్ నోడల్ అధికారి ఎస్పీ రాజ్‌కుమార్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, డీసీఓ శ్రీనివాసమూర్తి, మాస్టర్ ట్రెయినర్ తరాల పరమేష్ పాల్గొన్నారు.

ఎన్నికల పరిశీలకుడు ధనుంజయ్‌కు కలెక్టర్ స్వాగతం
నల్లగొండ, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకుడు ధనుంజయ్ దేవాంగాన్ ఆదివారం జిల్లా కేంద్రానికి రాగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆయ న్ను కలిసి స్వాగతం పలికారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన్ను కలిసిన కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. ఓటర్లకు ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నట్లయితే 8333986453 ఫోన్ చేయాలని పరిశీలకుడు ధనుంజయ్ తెలిపారు. అదే విధంగా ఎన్నికల పరిశీలకుల లైజన్‌గా వ్యవహరిస్తున్న కోనం శ్రీనివాస్ 9948095101 నెంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక అధికారి కోటేశ్వర్‌రావు, డీఎఫ్‌ఓ సుదర్శన్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...