నేడు ఎంజీయూ పాలక మండలి సమావేశం


Fri,March 22, 2019 02:38 AM

ఎంజీ యూనివర్సిటీ : మహాత్మగాంధీ యూనివర్సిటీ పాలక మండల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. వీసీ ప్రొ॥ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పాలక మండలి సభ్యులతోపాటు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పాల్గొంటారు. ప్రతి పర్యాయం హైదరాబాద్‌లోనే ఈ సమావేశం నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ 11, 2018లో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీయూలో అక్రమంగా నియామకమైన 32 మంది బోధనా సిబ్బందిపై వేటు వేయాలని ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీసీ, రిజిస్ట్రార్లపై పలు విమర్శలు వస్తున్నాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 2011 నవంబర్ 15న జరిగిన టీచింగ్ పోస్టుల భర్తీలో 32 మందిని అక్రమ నియామకం జరిపారని సిద్దికి కమిటీ నివేదిక ఇచ్చింది. నియామకమైన వారంతా నోటిఫికేషన్‌లో చూపిన అంశాలకు విరుద్ధంగా భర్తీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇదే విషయమై నమస్తే తెలంగాణ మినీలో పలు శీర్షికలు ప్రచురితమయ్యాయి. ఏడేళ్లుగా వారిపై తీసుకున్న చర్యలు శూన్యమే. పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవడం ఏంటనేది ప్రశ్నార్థకం. కాగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగే సమావేశంలోనైనా ఈ అంశంపై స్పష్టత వస్తుందా అనేది ఆశాజనకమే. మరో వైపు 32 మందికి నోటీసులు పంపినట్లుగా తెలుస్తున్నప్పటికీ రిజిస్ట్రార్ ప్రొ॥ ఎం.యాదగిరి మాత్రం ఈ విషయమై సంప్రదించగా అలాంటిది ఏమీ లేదని సమాధానమిచ్చారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...