ఎమ్మెల్సీ పోలింగ్‌కు సిద్ధం


Thu,March 21, 2019 12:49 AM

- ఈ నెల 22న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్, 26న కౌంటింగ్
- ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం
- నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 185 పోలింగ్ కేంద్రాలు
- బరిలో 9 మంది అభ్యర్థులు

రామగిరి : ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పటిష్టమైన భద్రతను సైతం ఏర్పాటు చేసారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ఈ నెల 26న కౌంటింగ్ జరుగనుంది. కౌంటింగ్ కోసం నల్లగొండలోని దుప్పలపల్లి సమీపంలోని ఎఫ్‌సీఐ గోదాములో అన్ని సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేయగా కౌంటింగ్ విధానంపై అవగాహన కల్పించి బుధవారమే మాక్ కౌంటింగ్‌ను సైతం నిర్వహించారు.

20,888 మంది ఓటర్లు..
శాసన మండలి ఎన్నికల్లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని 20,888 మంది గురువులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7030, వరంగల్ జిల్లాలో 7589 మంది, ఖమ్మం జిల్లాలో 5997 మంది ఓటర్లున్నారు.

185 పోలింగ్ స్టేషన్లు..
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 185 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నల్లగొండ జిల్లాలో 58 కేంద్రాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయ ఎంఎల్‌సీ కోసం 58 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో నల్లగొండలో 30 కేంద్రాలు ఉండగా 3859 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సూర్యాపేట జిల్లాలో 22 కేంద్రాలు ఏర్పాటు చేయగా 2183 మంది ఉపాధ్యాయులు, యాదాద్రి భువనగిరిలో 16 కేంద్రాలు ఏర్పాటు చేయగా 1293 మంది ఉపాధ్యాయులు మొత్తం 7335 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

బరిలో 9 మంది అభ్యర్థులు
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికల కోసం 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అతి పెద్ద ఉపాధ్యాయ సంఘమైన పీఆర్‌టీయూ నుంచి పూల రవీందర్, యూటీఎఫ్ నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎస్‌టీయూ అనుబంధ సంఘాల నుంచి సంగని మల్లేశ్వర్, స్వతంత్ర అభ్యర్థులుగా పీఆర్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి, విశ్రాంత డీఈఓ డా. ఏలె చంద్రమోహన్, విశ్రాంత ఉపాధ్యాయులు సురేష్, ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ వెంకట రాజయ్య, దుర్గం శివయ్య, వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు.

ఈపీఐసీ కార్డుతో ఓటేయవచ్చు
నీలగిరి : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం తమ ఈపీఐసీ కార్డు ద్వారా ఓటు వేయవచ్చని కలెక్టర్, రిటర్నింగ్ అధికారి గౌరవ్ ఉప్పల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈపీఐసీ కార్డు లేని వారు తమ గుర్తింపు నిరూపించుకోవడం కోసం ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన 9 రకాల ఫొటోలతో కూడిన ఏదైన ప్రత్యామ్నయ డాక్యుమెంట్లు సమర్పించాలన్నారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్‌లైసెన్స్, విద్యా సంస్థలు జారీ చేసిన ఫొటోగ్రాఫ్‌లతో కూడిన సర్వీస్ గుర్తింపుకార్డు, యూనివర్సిటీ ద్వారా జారీ చేసిన డిగ్రీ, డిప్లమా ఒరిజినల్, ఆదాయ పన్ను గుర్తింపుకార్డు (పాన్‌కార్డు), అంగవైకల్యం కలిగినట్లు నిర్ధారిస్తూ సంబంధిత అధికారి జారీ చేసిన ఒరిజినల్ గుర్తింపు సర్టిఫికెట్ , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలులేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోలతో కూడిన సర్వీస్ గుర్తింపు కార్డు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన గుర్తింపుకార్డు, ఆధార్‌లతో ఓటు వేయవచ్చని తెలిపారు.


90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...