చేయాల్సింది ఇంకా ఉంది


Thu,March 21, 2019 12:48 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రబల మైన ఉపాధ్యాయ శక్తి పీఆర్టీయూ అధికారిక మద్దతుతో రెండోసారి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లా ల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తన అఖండ విజయం ఖా యమని.. ఇప్పటికే సాధించిన ఎన్నో పనులతో పాటు రెండోసారి శాసన మండలి సభ్యుడిగా ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారం కోసం సాధించాల్సిన ప్రణాళిక సిద్ధంగా ఉందని పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ చెబున్నారు. రేపటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయన నమస్తే తెలం గాణ ఇంటర్వ్యూలో మరెన్నో విషయాలు మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

నెలలో 25 రోజులు ఉపాధ్యాయుల మధ్యనే..
ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం 30 ఏండ్లకు పైగా శ్రమిస్తున్నా. మండలస్థాయిలో పీఆర్టీయూ అధ్య క్ష, కార్యదర్శిగా 20 ఏండ్లు పని చేశాను. జిల్లా అధ్యక్ష, కార్యదర్శిగా నాలుగేండ్లు.. రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా రెండేండ్లు పని చేశా. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయుల జేఏసీ (టీ జాక్) చైర్మన్‌గా ఉపాధ్యాయులందరి భాగస్వామ్యంతో రాష్ట్ర సాధన ఉద్యమం లో పాలుపంచుకున్నాం. గడిచిన ఆరేండ్ల నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నెలలో 25 రోజులు ఉపాధ్యాయు ల మధ్యనే ఉంటూ .. వాళ్ల సంతోషాలు, కష్ట సుఖాలు, ఆపద సమయాల్లో అండగా ఉంటూ వస్తున్నా. ఒక ఉపాధ్యాయుడి భార్యకి గుండె చికిత్సకు రూ.25 లక్షలు.. మరో ఉపాధ్యాయుడి కూతురి బిడ్డ అత్యవసర సమయంలో రూ.30 లక్షలు.. ఇలా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ఆర్థిక సాయం ఇప్పించాను. వందల మందికి ఒకేరోజులో ఈహెచ్‌ఎస్ అప్రూవల్స్ ఇప్పించి అండగా నిలబడ్డా.

పీఆర్టీయూ ప్రబల శక్తి, నా విజయం ఖాయం
తొలిసారి ఉపాధ్యాయులు ఘన విజయంతో నన్ను శాసన మండలి సభ్యుడిగా గెలిపించారు. ఈసారి మరో అవకాశం కోరుతున్నా. పీఆర్టీయూ ప్రబలమైన ఉపాధ్యాయ శక్తి. ఆ సంఘం అధికారిక అభ్యర్థిగా నాకు ఇతరుల నుంచి పోటీ నామమాత్రమే అనేది ఉపాధ్యాయులే చెప్తున్న మాట. మొత్తం 45 ఉపాధ్యాయ సం ఘాలు నాకు మద్దతిస్తున్నాయి. అందరి సహకారంతో.. సాధించాల్సిన మరిన్ని సమస్యల సాధన కోసం ఉపాధ్యాయులందరూ నన్ను దీవిస్తారని.. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎన్నో సాధించుకున్న మా ద్వారానే మరిన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనేది ఉపాధ్యాయ లోకం నమ్మకం.

ప్రభుత్వ సహకారంతో ఎన్నో సాధించుకున్నాం
తొలిసారి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆరేండ్లలో ఉపాధ్యాయుల కోసం అనేక పనులు సాధించాం. ముఖ్యం గా కేసీఆర్ ప్రభుత్వ సహకారంతో 43 శాతం పీఆర్సీని సాధించుకోవడం.. 9 నెలల ఏరియర్స్, మహిళా ఉపాధ్యాయులకు 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. హెల్త్ కార్డులు తెచ్చుకున్నం. ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధన కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించాం. ఈ అంశం సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ వేసి స్టే తెప్పించడం కోసం రూ. కోటి ఖర్చును సైతం ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి.. ఉపాధ్యాయులకు ఖర్చు లేకుండా చేశాము. 10,479 పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడ్ కోసం జీఓ నంబర్ 15 చేయించాం. సకల జనుల సమ్మె సమయం 32 రోజులు ఆన్ డ్యూటీ.. ఆ తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహించిన 12 రోజులు క్యాష్‌లెస్ ఈఎల్‌లుగా ఇప్పించాం. కస్తూర్బా టీచర్లు, ప్రిన్సిపాళ్ల వేతనాల పెంపు సహా ఎన్నెన్నో ఉన్నాయి.

త్వరలోనే మంచి పీఆర్సీ వచ్చేందుకు కృషి చేస్తా
ఆరేండ్లలో ఎన్ని సాధించినా.. ఇంకా అనేక సమస్యలు ఉపాధ్యాయుల పక్షాన సాధించుకోవాల్సి ఉంది. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి త్వరలోనే మంచి పీఆర్సీని సాధించుకోవడం.. ఇప్పటికే సీఎం ప్రకటించిన 61 ఏండ్లకు పదవీ విరమణ వయసు పెంపు ఉత్తర్వులు జారీ చేయించడం.. సీపీఎస్ విధానం రద్దు చేయించి పాత పెన్షన్ విధానం అమలు చేయించడం.. కస్తూర్బా టీచ ర్లు, ఎస్‌ఓలు, మోడల్ స్కూల్, గురుకుల టీచర్లు, కాం ట్రాక్ట్ జూనియర్, డిగ్రీ లెక్చరర్ల సమస్యలు సహా ప్రతి ఒక్కటీ పరిష్కరింపజేయిస్తా. మరింత మెరుగైన హెల్త్ కార్డులు ఇప్పిస్తాం. సర్వీస్ రూల్స్ ద్వారా డిప్యూటీ ఈఓలు, డైట్ లెక్చరర్లు, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు భర్తీ చేసే అంశం సైతం పూర్తి చేయిస్తాం. ఇలాంటి ఇంకెన్నో సమస్యలు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే భారీ మెజారిటీ అందించి ఉపాధ్యాయులు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...