నకిరేకల్‌లో కాంగ్రెస్ ఖాళీ..!


Thu,March 21, 2019 12:47 AM

నార్కట్‌పల్లి: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నకిరేకల నియోజకవర్గం నుంచి భారీగా కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సమక్షంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, నాయకులు పార్టీలో చేరారు. వారికి కేటీఆర్‌తో పాటు మంత్రి జగదీష్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నకిరేకల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేసీఆర్‌సారధ్యంలో పని చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్ణయించుకోవడంతో పాటు తాను కూడా టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో నియోజక వర్గంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు చిరుమర్తి వెంటే నడిచేందుకు పయనమయ్యారు. పార్టీలో చేరిన వారిలో నకిరేకల్ సీపీఎం నాయకుడు మామిడి సర్వయ్య, భద్రయ్య, సోమన్న , సర్పంచులు విజయలక్ష్మి, శ్రీను, విజయ్, లక్ష్మి, నవీన్‌రెడ్డి, కేతేపల్లి నుంచి ప్రదీప్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మారం వెంకటరెడ్డి, చిట్యాల నుంచి దయాకర్‌రెడ్డి, జడల ఆదిమల్లయ్య, నార్కట్‌పల్లి నుంచి జడ్పీటీసీ సభ్యుడు దూదిమెట్ల సత్తయ్యయాదవ్, స్రవంతి, మేకల రాజిరెడ్డి, స్వామి, బాజ యాదయ్య, కొప్పుబాలకృష్ణ, కొండల్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, కృష్ణ, వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...