యాదాద్రిలో నిత్య పూజల కోలాహలం


Thu,March 21, 2019 12:47 AM

యాదాద్రిభువనగిరి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహులను ఆరాధిస్తూ నిత్య పూజలు బుధవారం నిర్వహించారు. సుప్రభాతం చేపట్టిన అర్చకులు ప్రతిష్టమూర్తులను ఆరాధిస్తూ హారతిని నివేదించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం, అర్చన చేపట్టారు. లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. బాలాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి రోజు ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవోత్సవాలను సంప్రదాయంగా నిర్వహించారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన జరిపి సహస్రనామార్చన నిర్వహించారు. కొండపైన గల శివాలయంలో పరమేశ్వరుడిని ఆరాధిస్తూ అభిషేకించి అర్చించారు. పార్వతీదేవిని వేదమంత్రాలతో కొలిచారు. పలువురు భక్తులు హరిహరులను దర్శించి మొక్కు పూజలు చేపట్టారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వత్ర పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 29, 000 ఆదాయం సమకూరింది.

రూ. 5, 15, 412 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 5, 15, 412 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 53,902, రూ.100 టిక్కెట్‌తో రూ. 36, 900, కల్యాణకట్ట ద్వారా రూ. 11,800, గదులు విచారణ శాఖతో రూ. 25,800 ప్రసాదవిక్రయాలతో రూ. 2, 74, 110 శాశ్వత పూజల ద్వారా రూ. 10, 116 తో పాటు అన్ని విభాగాల ద్వారా రూ. 5, 15, 412 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...