పరిషత్ పోరుకు రెడీ!


Wed,March 20, 2019 02:07 AM

-పార్లమెంట్ ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ విడుదల
-మే తొలివారంలో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు
-2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పూర్తి
-తొలిసారిగా ఈవీఎంల ద్వారా పోలింగ్
-25న ఓటర్ల తుది జాబితా విడుదలకు కసరత్తు
నల్లగొండ, నమస్తే తెలంగాణ: గత ఏడాది డిసెంబర్ లో మొదలైనటువంటి ఎన్నికల వేడి జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే శాసన సభ, సర్పంచ్ ఎన్నికలు పూర్తి కాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనుండగా ఆ తర్వాత వెంటనే పరిషత్ ఎన్నికలకు నోటిపికేషన్ జారీ చేసి మే తొలివారంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఆయా రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ పరిషత్ ఎన్నికలపై క్లారిటీ ఇస్తూ ఏప్రిల్ 2వ వారంలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. దీనికి అందరూ సిద్ధ్దం కావాలని సూచిస్తు ఈసారి ఈవీఎంల ద్వారా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వచ్చే నెల రెండో వారంలో పరిషత్ నోటిఫికేషన్...
వచ్చే నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో వెంటనే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు గాను నోటిఫికేషన్ రానుంది. దీనికి సం బంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తిస్థా యి ఏర్పాట్లు చేయడంతో నోటిపికేషన్ అనంతరం ఎన్నికలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ ఏప్రిల్‌లో రానుండగా మే తొలి వారంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటివరకు బ్యాలెట్ పద్ధ్దతిలో ఈ ఎన్నికలు జరగ్గా ఈసారి ఈవీఎంల ద్వారా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. గత శాసనసభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల కంటే ఆరుశాతం మాత్రమే అదనంగా ఈవీఎంలు కావల్సి ఉండటంతో ఇదే పద్ధ్దతిని ఎంచుకున్నారు. అయితే ఆయా ఈవీఎంలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు గా బరిలో ఉండేటువంటి అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులు నిక్షిప్తం చేయనున్నారు.

ముగిసిన రిజర్వేషన్ల ప్రక్రియ...
జిల్లా వ్యాప్తంగా 31 జిల్లా ప్రాదేశిక, మండల పరిషత్ అధ్యక్షులతోపాటు 349 మండల ప్రాదేశిక నియోజక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను జిల్లా పరిషత్ అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసిం ది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్లను పూర్తి చేసి రాష్ట్ర కోటాలో జడ్పీ చైర్మన్, జిల్లా కోటాలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు చేశారు. అయితే జడ్పీస్థానం జనరల్ కేటగిరికి కేటాయించగా 31 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో 5 ఎస్టీ, 6 ఎస్సీ, 4బీసీ, 16 ఇతర వర్గాలకు రిజర్వు చేశారు. ఇందులో 16 మహిళలకు రిజర్వుచేయగా 15 జనరల్ స్థానాలుగా కేటాయించారు. ఇక 349 ఎంపీటీసీల్లో 53 ఎస్టీ, 65 ఎస్సీ, 56 బీసీ, 175 ఇతరులకు కేటాయించారు. అందులో 180 స్థానాలు మహిళలకు, 169 స్థానాలు జనరల్ అభ్యర్థులకు రిజర్వు చేశారు.

ఈనెల 25న ఓటర్ల తుది జాబితా....
గడిచిన శాసనసభ ఎన్నికల ఓటర్ల మదర్‌రోల్ జాబి తా ఆధారంగా ఇప్పటికే జిల్లా పరిషత్ యంత్రాంగం గ్రామీణ ఓటర్ల జాబితాను వేరు చేశారు. అయితే ఆ తర్వాత రెండు దఫాలుగా ఓటర్ల నమోదు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ తిరి గి గత నెల 19న తుది జాబితాను ప్రకటించారు. దీని ప్రకారం జిల్లాలో 13,58,103 మంది ఓటర్లుండగా అందులో 6,78,371 మంది పురుషులు, 6,79, 712 మంది స్త్రీలు , 20 మంది ఇతర ఓటర్లున్నారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరోసారి మార్పులు, చేర్పులు, నూతన నమోదుకు ఈనెల 15 వరకు అవకాశం కల్పించిన నేపథ్యంలో గత ఓటర్ల జాబితాలో హెచ్చు తగ్గులు ఉం డే అవకాశం ఉంది. అయితే మదర్‌రోల్ జాబితాకు తాజా అనుబంధ జాబితా జత చేసి ఈనెల 25న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...