సమర్థతే మళ్లీ గెలిపిస్తుంది


Wed,March 20, 2019 02:05 AM

-విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
రామగిరి : ప్రభుత్వానికి, ఉపాధ్యాయ, అధ్యాపకుల మధ్య వారధిగా ఉండదగ్గ వ్యక్తి పూల రవీందర్ ఒక్కడే అని, అందుకే ఆయనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూచించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూల రవీందర్‌కు మద్దతుగా 38 ఉపాధ్యాయ సంఘాలతో మంగళవారం రాత్రి స్థానిక బండారు గార్డెన్స్‌లో నిర్వహించిన ఆత్మీయ ఆశీర్వాద సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపే మార్గాలు రెండు కాగా అందులో ఒకటి పోరాటంతో సాధించడం, రెండోది అధికారంలో ఉండి ఒప్పించి సాధించడమని పేర్కొన్నారు. ఈ రెండింటిని కలబోసుకుని చిరునవ్వుతో సమస్యలకు మార్గాన్ని సులువుగా తీసుకొచ్చే వ్యక్తి రవీందర్ అని కొనియాడారు. ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ ఆయనకు సాటిరారని తెలిపారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలకు సీఎం కేసీఆర్ ద్వారా త్వరలో పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి పూలరవీందర్ మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై సుప్రీం కోర్టులో ఉన్న స్టే ఎత్తేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ. కోటి ఖర్చు పెట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపారన్నారు. ఎన్నికల అనంతరం ఉద్యోగోన్నతులు లభిస్తాయని పేర్కొన్నారు. ఇంకా ఉన్న సమస్యలను సీఎం సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పీఆర్‌టీయు అభ్యర్థి పూల రవీందర్‌కు అన్ని సంఘాల మద్దతు ఉందన్నారు. అనంతరం పూల రవీందర్‌కు మద్దతు ప్రకటిస్తున్న 38 సంఘాల రాష్ట్ర, జిల్లాల నాయకులు మాట్లాడారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ ఆశీర్వాద సమ్మేళనంలో తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మందడి నర్సిరెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్స్ అధ్యాపకుల అసోసియేషన్ నాయకురాలు సుధారాణి, పీఎంటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల జగదీష్, జిల్లా అధ్యక్షుడు నరహరి, టీపీయూఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అలుగుబెల్లి పాపిరెడ్డి, తెల్కలపల్లి పెంటయ్య, జీహెచ్‌ఎంఎస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాలోతు బాలాజీనాయక్, సీహెచ్.చంద్రశేఖర్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి భిక్షపతి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేడి రామకృష్ణ, లచ్చిరాంనాయక్, పీఈటీ అసోసియేషన్ కొనగాని కృష్ణమూర్తి, టీయూటీఎఫ్ లక్ష్మీనారాయణయాదవ్, ఇతర సంఘాల నాయకులు మంగ్యానాయక్, కొండల్, బత్తిని భాస్కర్, సయ్యద్‌గౌస్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, బసిరెడ్డి రవీందర్‌రెడ్డి, పండితపరిషత్ అధ్యక్షులు విశ్వరూపం, బాకి యాదగిరి, ఓరుగంటి శ్రీనివాసులు, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...