ఫైల్ మిస్సింగ్ బాధ్యులెవరు?


Tue,March 19, 2019 02:45 AM

-మాయాజాలం శీర్షిక వచ్చేంత వరకు చోరీ విషయం తెలియని వైనం
-పోలీసు విచారణలో విచిత్ర సమాధానాలు..?
-అందరిపైనా పెరుగుతున్న అనుమానాలు
సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కలెక్టరేట్‌లోని సివిల్ సైప్లె కార్యాలయంలో ఫైల్ మిస్సింగ్‌కు బాధ్యులు ఎవరనేది పలు అనుమానాలకు తావిస్తోంది. ఓ మిల్లులో రూ.2.15కోట్ల విలువ చేసే ధాన్యం మాయం కావడంపై నమస్తే తెలంగాణ దినపత్రికలో మాయాజాలం శీర్షికతో వార్త ప్రచురితమయ్యేంత వరకు కూడా ఫైల్ మిస్సింగ్ అనేది ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. రూ.కోట్ల ధాన్యం మాయం కావడంతో జిల్లా పౌరసరఫరాల అధికారి హేమంత్‌సాయి ట్రేడింగ్ కంపెనీపై ఈ నెల 9న పంచనామా చేసి 12న కేసు నమోదు చేయగా ఈ నెల 15న పత్రికలో వార్త ప్రచురితమైంది. పంచనామా చేసిన అనంతరం వారంరోజుల వరకు కూడా మాయాజాలం చేసిన మిల్లుకు సంబంధించిన షూరిటీల ఫైల్ మిస్సింగ్ గుర్తించకుండా ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనుమానాలకు బలం చేకూర్చుతుంది. కాగా సివిల్ సైప్లె కార్యాలయంలోని ఓ ఉద్యోగిపై అనుమానం ఉన్నట్లు సూర్యాపేట టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు అందగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సివిల్‌సైప్లె కార్యాలయంలో తాను అసలు ఫైల్ ఇవ్వలేదని మిల్లు గుమస్తా చెబుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుండగా ఫైల్‌లో కేవలం చెక్కుమాత్రమే ఉండి మిగిలిన కాగితాలు ఎటు పోతాయి అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఏదైనా మిల్లుకు సీఎంఆర్ పాడీ ఇచ్చే సమయంలో ఇద్దరి షూరిటీలు కచ్చితంగా తీసుకుంటారు. మిల్లులో ధాన్యం మాయం అయిన విషయం తెలుసుకొని షూరిటీలు ఇచ్చిన వారే సివిల్ సైప్లె కార్యాలయంలో డబ్బులు ఇచ్చి ఫైల్ తీసుకుపోయినట్లుగా గుసగుసలు వినిపిస్తుండగా మిల్లు గుమస్తా అసలు ఫైలే ఇవ్వలేదని చెబుతుండడం గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవేళ గుమస్తా ఫైల్‌ను కార్యాలయంలో ఇవ్వని పక్షంలో రూ.కోట్ల ధాన్యాన్ని సదరు మిల్లుకు ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకమే. దీనిపై పోలీసులు లోతైన విచారణ చేపడితే గాని ఈ మొత్తం మాయలో పాత్రలు, సూత్రధారులు ఎవరనేది తేలనుంది.

పంచనామా చేసి 12న కేసు నమోదు చేయగా ఈ నెల 15న పత్రికలో వార్త ప్రచురితమైంది. పంచనామా చేసిన అనంతరం వారంరోజుల వరకు కూడా మాయాజాలం చేసిన మిల్లుకు సంబంధించిన షూరిటీల ఫైల్ మిస్సింగ్ గుర్తించకుండా ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనుమానాలకు బలం చేకూర్చుతుంది. కాగా సివిల్ సైప్లె కార్యాలయంలోని ఓ ఉద్యోగిపై అనుమానం ఉన్నట్లు సూర్యాపేట టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు అందగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సివిల్‌సైప్లె కార్యాలయంలో తాను అసలు ఫైల్ ఇవ్వలేదని మిల్లు గుమస్తా చెబుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుండగా ఫైల్‌లో కేవలం చెక్కుమాత్రమే ఉండి మిగిలిన కాగితాలు ఎటు పోతాయి అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఏదైనా మిల్లుకు సీఎంఆర్ పాడీ ఇచ్చే సమయంలో ఇద్దరి షూరిటీలు కచ్చితంగా తీసుకుంటారు. మిల్లులో ధాన్యం మాయం అయిన విషయం తెలుసుకొని షూరిటీలు ఇచ్చిన వారే సివిల్ సైప్లె కార్యాలయంలో డబ్బులు ఇచ్చి ఫైల్ తీసుకుపోయినట్లుగా గుసగుసలు వినిపిస్తుండగా మిల్లు గుమస్తా అసలు ఫైలే ఇవ్వలేదని చెబుతుండడం గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవేళ గుమస్తా ఫైల్‌ను కార్యాలయంలో ఇవ్వని పక్షంలో రూ.కోట్ల ధాన్యాన్ని సదరు మిల్లుకు ఎలా ఇచ్చారనేది ప్రశ్నార్థకమే. దీనిపై పోలీసులు లోతైన విచారణ చేపడితే గాని ఈ మొత్తం మాయలో పాత్రలు, సూత్రధారులు ఎవరనేది తేలనుంది.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...