శాస్ర్తోక్తంగా లక్ష్మీనృసింహుని నిత్యకల్యాణం


Tue,March 19, 2019 02:45 AM

మఠంపల్లి : పవిత్ర పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మీనృసింహస్వామి వారికి సోమవారం నిత్యకల్యాణం ఆలయ అర్చకులచే శాస్ర్తోక్తంగా నిర్వహించారు. పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతూ కృష్ణానది తీరాన వేంచేసియున్న మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లకు నిత్యకల్యాణోత్సవంలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరనం, పంచగవ్య ప్రాసన నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి మాంగళ్యధారణ తలంబ్రాలతో కల్యాణతంతు నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులకు నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన గావించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్, కార్యనిర్వాహణాధికారి ఉదయభాస్కర్, ఆలయ అర్చకులు ఫణిగిరి మంగాచార్యులు, పద్మనాబాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, శ్రీనివాసచార్యులు, కృష్ణమాచార్యులు భక్తులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...