పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు


Tue,March 19, 2019 02:45 AM

-ఎస్పీ రంగనాథ్
నల్లగొండక్రైం: త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావం లేకుండా చేసేందుకు పకడ్బందీగా బందోబస్తు నిర్వహించేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ ఏవీ. రంగనాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్, ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో బెల్టు షాపులను అనుమతించబోమని స్పష్టం చేశారు. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తే ఆయా దుకాణాల యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పని చేసే విధంగా చూసుకోవాలన్నారు. డబ్బులు చెల్లించకుండా రసీదులు, చిట్టీలు తీసుకుని మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 20 నుంచి జిల్లాలో ఎక్కడ బెల్టు షాపులు కనిపించకుండా పోలీస్, ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగకుండా చూసుకోవాలని అదే సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. కల్తీ మద్యం, నాటుసారా, గుడుంబా విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్య మాట్లాడుతూ శాసన మండలి, పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం ప్రభావం లేకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. సమావేశంలో ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీలు గంగారామ్, శ్రీనివాస్, మహేశ్వర్, రమేష్, సీఐలు శివరాంరెడ్డి, శ్రీకాంత్, నరేందర్, రమణారెడ్డి, సురేష్‌కుమార్, వేణుగోపాల్ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...