నాటు మోసం


Tue,March 19, 2019 02:45 AM

- నాటుకోడిని పోలిన బాయిలర్ కోళ్లు
- ఆంధ్రా ప్రాంతం నుంచి దిగుమతి
- నాటుకోళ్లుగా ప్రచారం చేస్తూ అధిక రేట్లకు విక్రయం
- మోసపోతున్న మాంసం ప్రియులు
త్రిపురారం: నాటుకోడిలాగే ఉంటుంది. రంగు, రూపు, ఆకారం అన్నీ అలాగే ఉన్నప్పటికీ.. అది మాత్రం బాయిలర్‌కోడే. ఆంధ్రాలోని గుంటూరు ప్రాంతంలో ఈ రకం కోళ్లను పెంచుతుండగా.. మన ప్రాంత చికెన్‌షాపు యజమానులు ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి చేసుకుంటున్నారు. మాంసం ప్రియులు నాటు కోడి కొనుగోకే ఇష్టపడుతుండగా.. ఈ రకం కోళ్లనే అధిక ధరలకు వారికి అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. చూసేందుకు మాత్రం నాటుకోడిలాగే ఉన్నప్పటికీ వం డాక మాంసం రుచిలో తేడా ఉండడంతో తాము మోసపోయినట్లు వినియోగదారులు గ్రహించినా.. చేసేది లేక మిన్నకుంటున్నారు. నాటుకోళ్లను పోలిన బాయిలర్ కోళ్లు ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నా యి. రంగు, రూపు, ఆకారం అచ్చం నాటుకోళ్లకు తగ్గకుండా ఉండడంతో చికెన్ సెంటర్ల యాజమానులకు కలిసి వస్తోంది. ప్రస్తుతం మాంసం ప్రియులు బాయిలర్, జుట్టుకోళ్ల కంటే నాటుకోళ్ల కొనుగోలుకే అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో వాటికి డిమాండ్ పెరిగింది. మాంసం ప్రియుల నాడి పసిగట్టిన చికెన్‌సెంటర్ల యాజమానులు వాటిని అధిక ధరలకు అంటగడుతూ మాంసం ప్రియుల జేబులను గుళ్ల చేస్తున్నారు. సదరు బాయిలర్ కోళ్లు అచ్చం నాటుకోళ్లలాగే ఉండడంతో ప్రజలు కూడా వాటిని అధికంగా కొనుగోలు చేస్తున్నా రు. త్రిపురారం మండలకేంద్రంలో ఈ రకమైన వ్యాపా రం జోరుగా సాగుతోంది. కొందరు చికెన్‌సెంటర్ల యజమానులు ఆంధ్రాప్రాంతంలోని గుంటూరు ప్రాంతం నుంచి ఈ రకం కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని తక్కువ రేటుకే కొనుగోలు చేస్తూ ప్రజలకు మా త్రం నాటుకోడి ధరకు విక్రయించి మోసం చేస్తున్నారు.

హాసిల్ జాతి కోళ్లు
ఆంధ్రాలోని గుంటూరుతో పాటుగా చుట్టు పక్కల గ్రా మాల్లో హాసిల్ జాతికి చెందిన పందెం కోళ్లను పెంచుతారు. ఈ కోడి ఎత్తుగా పెరుగుతుంది. బాయిలర్ కోడి ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ అధిక బరువు ఉంటుంది. దీంతో కొందరు హాసిల్ జాతిని బాయిలర్ కోడితో క్రాసింగ్ చేసి ఈ కొత్తం రకం కోళ్లను సృష్టించారు. ఈ రకం కోళ్లు నాటుకోడిలాగా ఎత్తుగా, అధిక బరువుతో ఉంటుంది. ప్రస్తుతం గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఈ రకం బాలర్ కోళ్లను షెడ్లలో పెంచుతున్నారు.
ఇదీ బాయిలర్ రకమే..
మామూలుగా నాటుకోడి ఆరు నెలల్లో కేజీ బరువు పెరుగుతుంది. కానీ ఈ కొత్త రకం కోళ్లను షెడ్‌లలో పెంచుతూ వాటికి బాయిలర్ కోళ్లలాగే దాణా, ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల కేవలం మూడు నెలల్లోనే రెండు కేజీల వరకు బరువు పెరుగుతాయి. అంతేకాకుండా ఇవి తొందరగా రోగాల బారిన పడవు. చూడడానికి అచ్చం నాటుకోళ్ల లాగానే ఉండడం వీటి ప్రత్యేకత.

క్వింటాళ్లలో దిగుమతి
ఆంధ్రాప్రాంతంలోని గుంటూరు నుంచి కొందరు చికెన్‌సెంటర్ల యజమానులు ఈ కోళ్లను క్వింటాళ్ల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. క్వింటా కోళ్లను చికెన్‌సెంటర్ల యాజమానులకు రూ. 15000లకు కొనుగోలు చేస్తున్నారు.(కేజీ రూ.150) ఇదే ధరకు సదరు ఫాంల యజమానులు ఆంధ్రాప్రాంతం నుంచి వాళ్ల వాహనాల్లోనే తీసుకొచ్చి చికిన్‌సెంటర్ల వద్ద దిగుమతి చేస్తున్నారు.
నాటుకోళ్ల ధరకే విక్రయం
త్రిపురారం మండలకేంద్రంలో బాయిలర్ కోడి కేజీ రూ.100, లేయర్ కేజీ రూ.120, నాటుకోడి కేజీ రూ. 260 నుంచి 280 వరకు విక్రయిస్తున్నారు. ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చిన నాటుకోళ్లను పోలిన బాయిలర్ కోడి కేజీ రూ.150 మాత్రమే ఉండగా చికెన్‌షాపుల వారు మాత్రం వాటిని నాటుకోళ్లుగా నమ్మించి కేజీ రూ.260 నుండి 270 వరకు విక్రయిస్తున్నారు. కోడి కాని ఈ కోడి అచ్చం నాటుకోడిలాగే ఉన్నప్పటికీ మాంసం ప్రియులు దానిని కూర వండి తినే తరుణం లో తేడాను గుర్తించి తాము మోసపోయామని గ్రహిస్తున్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...