నేటి నుంచి పార్లమెంట్ నామినేషన్ల స్వీకరణ


Mon,March 18, 2019 12:46 AM

-ఈనెల 25వరకు స్వీకరణ
- 26న స్క్రూట్నీ
-27న అభ్యంతరాల స్వీకరణ
- 28న ఉపసంహరణ
-ఏ్రప్రిల్ 11న పోలింగ్
నల్లగొండ, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వచ్చే నెల 11న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 25వరకు ఈ నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి నేడు కేంద్ర ఎన్నికల సంఘం ఫారం-1 నోటిఫికేషన్ జారీచేయనుండగా 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత 26వ తేదీన స్క్రూట్నీ నిర్వహించి 27న అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం 28న ఉపసంహరణ జరుగనుంది. ఆతర్వాత ఏప్రిల్ 11న పోలింగ్ జరుగనుంది.
శివాజీనగర్ : నామినేషన్ స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ కార్యాలయంలో డీఆర్వో రవీంద్రనాథ్, ఇతర అధికారులతో చర్చించారు.
అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు...
1. నామినేషన్ ఫారం-2(ఏ)లో నింపి రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి గాని లేదా అతనిని ప్రతిపాదించే వ్యక్తులు కానీ అందించాలి.
2. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల మధ్య మాత్రమే రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి.
3.ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలలో నామినేషన్ ఫారాలు స్వీకరించరు.
4. రిటర్నింగ్ అధికారి చాంబర్‌లోకి అభ్యర్థి మరియు అతడితో పాటు నలుగురు వ్యక్తులు మాత్రమే అనుమతి.
5. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్లల పరిధిలోకి 3 వాహనాలు మాత్రమే అనుమతి.
6.అభ్యర్థ్ధిని ప్రతిపాదించే ఓటర్లు నియోజకవర్గపరిధిలోని వారై ఉండాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి అయితే ప్రతిపాదకులు ఒక్కరూ చాలు. ఇతరులు పోటీ చేయాలనుకుంటే 10మంది ప్రతిపాదకులు ఉండాలి.
నామినేషన్ ఫారంతో జతపర్చాల్సిన వివరాలు..
l భారత ఎన్నికల సంఘంచే తయారు చేయబడిన ఫారం-26 అఫిడవిట్ జత చేయాలి.
l ఫారం-26ను స్టాంప్ పేపర్ యొక్క డీ నామినేషన్ రూ.20కంటే ఎక్కువ ఉండాలి. నోటరైజ్ చేయబడిన ఫారం 26ను సమర్పించాలి.
l ఎన్నికల ఖర్చులను చూపించడం కోసం నూతన బ్యాంక్ అకౌంట్‌ను నామినేషన వేసే 24 గంటల ముందే అభ్యర్థి పేరు మీద గానీ లేదా అభ్యర్థ్ధి ఏజెంట్ జాయింట్ అకౌంట్ గాని తెరువవలెను.
l అభ్యర్థి ఇతర నియోజకవర్గానికి చెందిన ఓటరైతే extract of electoral roll (ఓటర్ జాబితాలో పేరు ఉన్నట్లు రుజువు) ఈ.ఆర్.ఓచే తీసుకురావలె.
l అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన లేదా రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీల అభ్యర్థి అయితే ఫారం -ఏ, ఫారం-బీను ఈనెల25మధ్యాహ్నం 3 గంటల కంటే ముందే రిటర్నింగ్ అధికారికి అందించాలి.
l రిటర్నింగ్ అధికారి ముందు అభ్యర్థ్ధి నామినేషన్ వేసిన అనంతరం ప్రమాణం చేయాల్సి ఉంటుంది.
l అభ్యర్థి యొక్క పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు 2 సెం.మీ (వెడల్పు), X 2.5 సెం.మీ (ఎత్తు) 20 సమర్పించాలి.
l ఫొటోలు ప్రస్తుతం, లేక 3నెలల కిందట దిగినవి అయి ఉండాలి.
l నామినేషన్ సమయంలో ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులైతే రూ.12,500, ఇతరులు ఎవరైనా రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించి నామినేషన్ దాఖలు చేయాలి.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...