పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తాం


Mon,March 18, 2019 12:44 AM

-మర్రిగూడ, నాంపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ బూర
మర్రిగూడ: ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ గెల్చుకుంటుందని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం మండల కేం ద్రంలోని జీకేఆర్ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన మర్రిగూడ, నాంపల్లి మండలాల ముఖ్యకార్యకర్తల సమావేశానికి మునుగోడు మాజీఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ స్థానంలో ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎంపీగా పని చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసింది ఏమీ లేదని పార్లమెంట్‌లో ఒక్క రోజుకూడా మాట్లాడిన దాఖలాలేవన్నారు. భువనగిరి అభివృద్ధి కోసంఏ పని చేయని రాజగోపాల్ తన అన్న కోమ టి వెంకట్‌రెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటానని లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననడం హస్యాస్పదమని విమర్షించాడు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని రూ.1028కోట్లతో ఎయిమ్స్ తీసుకురావడానికి ఎంతో కృషిచేశానన్నారు.

మళ్లీ ప్రజలకు సేవభాగ్యం మరోసారి కల్పించాలని కోరారు. మాజీఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజగోపాల్ నియోజకవర్గం ముఖంకూడా చూడలేదని ముంపు భూనిర్వాసితులకు రూ.10 లక్షలు నష్ట పరిహారం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని అలాంటి అన్నదమ్ములను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. భువనగిరి నియోజక అభివృద్ధికి బూర నర్సయ్యగౌడ్ భువనగిరిలో పాస్‌పోర్ట్ కార్యాలయం, జనగాంలో 100 పడకల ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాల, యాదగిరిగుట్ట రద్దీని దృష్టిలో పెట్టుకుని 60 రోజులలోనే ఎంఎంటీఎస్ మంజూరు చేయించాలని తెలిపారు. నిస్వార్ధపరుడైన నర్సయ్యను ఎంపీగా గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సం దర్భంగా సరంపేట గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి వర్కాల వెంకటేష్ ఆధ్వర్యంలో 250మంది ఎంపీ బూర నర్సయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మునగాల నారాయణరావు, మర్రిగూడ, నాంపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు వెంకన్న, జగదీష్, పాశం సురేష్‌రెడ్డి, రామకృష్ణ, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రావు, రాములుగౌడ్, నర్సిం హ, వెంకటేష్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...