పూల రవీందర్ గెలుపునకు కృషి చేయాలి


Mon,March 18, 2019 12:44 AM

-హైదరాబాద్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి
మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ: ఉపాధ్యాయులకు అన్నివిధాలుగా అండగా ఉం టున్న ఎమ్మెల్సీ అభ్యర్థ్ది పూల రవీందర్‌కు అండగానిలిచి భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని హైదరాబాద్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్వీ గార్డెన్ ఫంక్షన్‌హాల్లో జరిగిన పీఆర్టీయూ మిర్యాలగూడ డివిజన్ ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐదేళ్లుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పూల రవీందర్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో పండిట్ టీచర్లకు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి జీఓ జారీకి కృషి చేశారని, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సర్వీ సు రూల్స్ తీసుకురావడం జరిగిందని తెలిపారు.

ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ అహర్నిషలు ఉపాధ్యాయుల సమస్యల కోసం పని చేస్తున్న పూల రవీందర్‌ను ఉపాధ్యాయులు భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థ్ది పూల రవీందర్ మాట్లాడుతూ గత ఐదేళ్లు సీఎం కేసీఆర్ సహకారంతో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించానని, మరోసారి అవకాశం ఇస్తే ఉపాధ్యాయులకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రవీందర్రెడ్డి, యాపాల నరేందర్‌రెడ్డి, బాలాజీనాయక్, కృష్ణమూర్తి, బిక్షపతి, జగదీష్, వెంకటేశ్వర్లు, మామిల్ల శ్రీనివాస్‌రెడ్డి, రాయికింది సైదులు, దస్తగిరి, వెంకయ్య, వేణు, చాడ శ్రీనివాస్‌రెడ్డి, రామచంద్రు తదితరులు ఉన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...