ఎంసీసీతోనే ప్రకటనలకు అనుమతి


Mon,March 18, 2019 12:43 AM

-రాజకీయనాయకుల పెయిడ్ న్యూస్‌పై ప్రత్యేక నిఘా
-కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
-పార్లమెంట్ ఎన్నికల మీడియా సెంటర్ ప్రారంభం
నల్లగొండ, నమస్తే తెలంగాణ: వచ్చే నెల 11న నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సమాచారం కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసి న మీడియా సెంటర్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదివారం ప్రారంభించారు. అదే విధంగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను సైతం ప్రారంభించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలక్ట్రానిక్ అండ్ ఫ్రింట్ మీడియాలో ప్రకటనలు ప్రచారం చేస్తే ముందస్తుగా ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు మీడియా సర్టిఫికేషన్ అండ్ మాని టరింగ్ నుంచి అనుమతి పొందాలన్నారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో ప్రకటనలపై నిత్యం పర్యవేక్షణ ఉంటుందని, ఎన్నికల సమయంలో మీడి యా పరంగా ఏమైనా అతిక్రమణలు జరిగితే కమిటీ పర్యవేక్షిందన్నారు.

ఎన్నికల నియమావళిని అనుసరించి మతాలు, వర్గాలపై దాడి, దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలు లేకుండా ఉండటం, హింసను ప్రేరేపించ డం, కోర్టు తీర్పులకు వ్య తిరేకంగా ఉండ టం, వ్యక్తిగత అంశాలను పరిగణలోకి తీ సుకొని అనుమతి ఇవ్వ డం జరుగుతుందని అ న్నారు. ఎంసీసీ అనుమతి ద్వారానే రాజకీ య ప్రకటనలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆయా ఎలక్ట్రానిక్ అండ్ ఫ్రింట్ మీడియా లో ఫెయిడ్ న్యూస్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండే ఫెయిడ్ న్యూస్‌ను ఎంసీసీ కమిటీ గుర్తిస్తుందన్నారు. ఇందుకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేశామని ఫెయిడ్ న్యూస్‌గా గుర్తిస్తే అభ్యర్థ్దికి నోటీసులు అందజేస్తామన్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం రేట్ కార్డును అనుసరించి వాటికి అయ్యే వ్యయాన్ని లెక్కించి అభ్యర్థి లెక్కలో జమచేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో రవింద్రనాథ్, డీపీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...