రేపు 37 సంఘాలతో సమావేశం


Mon,March 18, 2019 12:43 AM

-పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్
రామగిరి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థిగా పోటీలో ఉన్న పూల రవీందర్‌కు మద్ధతూ తెలిపే 37 సంఘాలసభ్యులతో జి ల్లా కేంద్రంలోని పీఆర్‌టీయూ భవనం ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ ఈనెల 19న సాయంత్రం 6గంటలకు జిల్లా కేంద్రంలోని బండారు గార్డెన్స్‌లో జరిగే నల్లగొండ డివిజన్ స్థాయి సమావేశానికి 2వేల మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో ఇప్పటికే ఎమ్మెల్సీగా పూల రవీందర్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పలు జీఓలు తీసుకొచ్చారన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అందుకే మరో పర్యాయం పూల రవీందర్‌ను గెలిపించి ఉపాధాయుల ఐక్యత చా టాలని కోరారు. పీఆర్‌టీయూతోపాటు మద్ధతూ తెలుపుతున్న అన్ని సంఘాల నేతలు ప్రచారాన్ని ఉదృతంచేసి ఉపాధ్యాయులను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులంతా సమావేశానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, పి.రవీందర్, ఉపాధ్యాయ సంఘాల నేతలు లక్ష్మీనారాయణయాదవ్, అలుగుబెల్లి పాపిరెడ్డి, భాస్కర్‌గౌడ్, బసిరెడ్డి రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్ ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...