గురుకుల విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి


Mon,March 18, 2019 12:43 AM

-బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు
మిర్యాలగూడరూరల్: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభట్టు కోరారు. మండలంలోని శ్రీనివాసనగర్‌లో ఉన్న బీసీ బాలికల గురుకుల పాఠశాల ద్వితీయ వా ర్షికోత్సవ వేడుకలను ఆదివారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్లయ్యభట్టు పా ల్గొని మాట్లాడారు. ప్రభుత్వ గురుకులాలు ఉన్నత లక్ష్యాలతో పనిచేస్తున్నాయన్నారు. గురుకుల విద్య ద్వారా మెరుగైన సమాజానికి నాంది పలకాలని సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన అందిస్తున్నామని, బీసీ విద్యార్థులంతా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి, జనార్దన్‌రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...