పది పరీక్షలు ప్రారంభం


Sun,March 17, 2019 02:43 AM

-తొలి రోజు ప్రశాంతం
-20,322 మంది విద్యార్థులు హాజరు.. 311 మంది గైర్హాజర్
-పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, డీఈఓ
-జిల్లా ప్రత్యేక పరిశీలకులు, ఓపన్‌స్కూల్ జేడీ ఎం. సోమిరెడ్డి
రామగిరి : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 96 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాగా తొలి రోజు జరిగిన తెలుగు పేపర్ -1 పరీక్షకు 20, 633మంది విద్యార్థులు హాజర్థులకు 20, 322మంది హాజరు కాగా 311 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష సమయం సమీపిస్తుండటంతో విద్యార్థులు కేంద్రాల్లోకి పరుగులు తీశారు. అన్ని కేంద్రాల వద్ధ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సందడిగా దర్శనమిచ్చారు. జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్, డీఈవో పీ.సరోజనీదేవిలు తనిఖీ చేశారు. పరీక్షల ఉమ్మడి జిల్లా ప్రత్యేక పరిశీలకులు తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్ ఎం.సోమిరెడ్డి పరిశీలించారు.

పదిపరీక్షలు కీలకం
అయితే ఈ పరీక్షలకు తొలి రోజు విద్యార్థులు వారి ఇష్టదైవమైన దేవాలయాలకు వెళ్లి తల్లిదండ్రులతో కలిసి పూజలు చేసి పరీక్ష కేంద్రాలకు వచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకొచ్చి వారికి మనో ధైర్యాన్ని నింపి పరీక్ష కేంద్రాలకు పంపించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జీరాక్స్ సెంటర్లను మూసి వేయించారు.
పరీక్ష కేంద్రాల తనిఖీ ..
నల్లగొండలో ప్రారంభమై పదో తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ నల్లగొండలోని డైట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. ఆయన వెంబడి డీఈవో పీ.సరోజనీదేవి ఉన్నారు. డీఈవోనల్లగొండలోని సెయింట్ ఆల్పోన్స్ స్కూ ల్‌లోని ఏ,బీ కేంద్రాలను, డాన్‌బాస్కో, గంథ వారి గూడంలోని మైనార్టీ పాఠశాలలో కేంద్రాలను పరిశీలించారు. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా ప్లయింగ్ స్కాడ్స్ 36, డీఎల్‌వో 5 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు జిల్లా పరీక్ష విభాగం అసిస్టెంట్ కమిషనర్ విజయభారతి వెల్లడించారు.

నెంబర్ సక్రమంగా లేక ఇబ్బందులు..
పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల హాల్ టికెట్స్ నెంబర్స్ ఏ రూమ్‌లో ఉన్నాయ్ చూసుకునేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలి. నల్లగొండలోని ఆర్పీరోడ్డులోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలతో పాటు వివిధ పాఠశాలల వద్ద చిన్న కాగితంపై నెంబర్లు వేసి గోడకు అంటించడంతో వాటిని చూసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంలో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థులకు పోలీసుల ఆల్‌ది బెస్ట్
నల్లగొండలోని వన్ టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన పరీక్ష కేంద్రాల వద్ధ విధి నిర్వహణలో ఉన్న పోలీసులు విద్యార్థులను స్వాగతించారు. ఆల్‌ది బెస్ట్ చెప్తూ ప్ల్లకార్డులను ధరించి శుభాకంక్షాలు తెలిపారు. అటు విధి నిర్వహణ, ఇటు సమాజిక సేవలో ఉన్న పోలీసులను ప్రజలు అభినందించారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...