రేపటి నుంచి లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ


Sun,March 17, 2019 02:41 AM

-వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్
రామగిరి : లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ సోమవారం నుంచి చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ సూచించారు. హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికలపై శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల కోసం అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల సమర్పణకు వచ్చేటప్పుడు పాటించాల్సిన నియమ, నిబంధనలను రాజకీయ పార్టీ నాయకులకు సూచించాలని తెలిపారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు ఇతర నలుగురు వ్యక్తులను మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతించాలని సూచించారు. అలాగే నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్లను ప్రభుత్వ సెలవు దినాల్లో స్వీకరించడం జరగదన్నారు. ప్రతీ అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖ లు చేసే అవకాశం ఉందన్నా రు. వీడియో కాన్ఫరెన్స్‌లో నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, సూ ర్యాపేట డీఆర్‌ఓ చంద్రయ్య, నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...