టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు


Sun,March 17, 2019 02:41 AM

సూర్యాపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నల్లగొండ జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డిల సమక్షంలో శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి, సూర్యాపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు జుట్టుకొండ సత్యనారాయణతో పాటు భారీగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అంగీరేకుల నాగార్జున, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుమ్మరికుంట్ల లింగయ్యలతోపాటు పెద్దఎత్తున చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో బీజేపీ నుంచి జిల్లా ఓబీసీ అధ్యక్షుడు శైలేంద్రాచారి, ఆత్మకూర్.ఎస్ సర్పంచ్ తంగెళ్ల వీరారెడ్డి, ఉప సర్పంచ్ గిలకత్తుల జానకమ్మ, మాజీ కౌన్సిలర్ చల్లా వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ, ఎండీ మొయినొద్దీన్, భూఖ్య పూల్‌సింగ్, సోమిరెడ్డి వెంకట్‌రెడ్డి, నెమ్మాది సంజీవ, పిడమర్తి నాగయ్య, ఉపేందర్, జుట్టుకొండ అజయ్‌కుమార్, నాతాల సురేందర్‌రెడ్డిలతో పాటు దాదాపు 200 మంది చేరారు. అలాగే అంగీరేకుల నాగార్జున, కుమ్మరికుంట్ల లింగయ్యలతోపాటు కౌన్సిలర్ బత్తుల ఝాన్సీరమేష్‌లతో సహా దాదాపు 100మందికి పైనే గులాబీ పార్టీలోకి చేరుకున్నారు. పార్టీలో చేరిన వారికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి జగదీష్‌రెడ్డిలు కండువాలు కప్పి ఆహ్వానించారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...