కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్


Sat,March 16, 2019 01:08 AM

నీలగిరి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో పారదర్శకంగా వ్యవహరించి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల కౌంటింగ్ విధానానికి, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విధానానికి తేడా ఉం టుందని నియమ నిబంధనల ప్రకారం కౌంటింగ్ నిర్వహించాలన్నారు. రిటైర్డు ఎన్నికల సంఘం కార్యదర్శి చావలి రామబ్రహ్మం ఎన్నికల కౌంటింగ్ విధానాన్ని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటువే స్తారని, ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి ఫలితాన్ని నిర్ణయిస్తామన్నారు. మొదట పోలింగ్ స్టేషన్ వారీగా బ్యాలెట్ బాక్సుల్లో పోలైన ఓట్ల మొత్తాన్ని లెక్కించి తర్వాత మొదటి ప్రాధాన్యత క్రమం ప్రకారం అభ్యర్థి ఓట్ల వారీగా ఓట్ల సం ఖ్యను లెక్కిస్తామన్నారు. ఈ క్ర మంలో చెల్లుబాటు కాని ఓట్ల ను మినహాయించి మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపుకు కావాల్సిన కోటాను నిర్ణయిస్తామని తెలిపారు. ఒకవేళ మొదటిరౌండ్‌లోనే ఏదేని అభ్యర్థ్ధి కోటాకు కావల్సిన ఓట్లను పొందితే అతని గెలుపు అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుందన్నారు. కోటాకు రావల్సిన ఓట్లు రానట్లయితే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని తొలగించి అతనికి పోలైన ఓట్లను కొనసాగింపులో ఉన్న ఇతర అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమం ఆధారంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ ప్రక్రియ ఏదేని అభ్యర్థి కోటాకు కావల్సిన ఓట్లు పొందే వరకు లేనట్లయితే ఆఖరు అభ్యర్థ్ధి మినహా మిగతా అభ్యర్థులందరు తొలగింపబడే వరకు కొనసాగుతుందన్నారు. కౌం టింగ్ నిర్వహణతోపాటు కౌంటింగ్‌కు సంబంధించిన వివిధ రకాల ఫారమ్‌లను విధిగా సమర్పించాలన్నారు. అనంత రం కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అ సిస్టెంట్లకు నమూ నా కౌంటింగ్‌ను నిర్వహంచారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అదికారి, డీఆర్‌ఓ రవీంద్రనాథ్, ట్రైనింగ్‌నోడల్ అధికారి రాజ్‌కుమార్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, సంగీతలక్ష్మీ, చరిత, నారాయణస్వామి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఎన్నికల బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదే: కలెక్టర్
ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణ బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శుక్రవా రం ఉదయాదిత్య భవన్‌లో టీచర్ ఎమ్మెల్సీ పీఓ, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ఒక టీమ్‌లా పనిచేసి పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో తాగునీరు రాత్రి బస ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్ నెంబర్ ఫారమ్ 7బీని ప్రదర్శించాల న్నారు. ఓటు ఎలా వేయాలి ఫ్లెక్సీ పోలింగ్ స్టేషన్ బయ ట ఓటర్ అవగాహనకు ప్రదర్శించాలన్నారు. పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రాఫర్, వెబ్‌కాస్టింగ్ నిర్వహణ చేస్తున్న వారితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధ్దతిన జరుగుతున్నందున బ్యాలెట్ పేపర్‌లో ఊదా రంగు స్కెచ్ పెన్‌తో ప్రాధాన్యత ప్రకారం ఓటేయాలన్నారు. బ్యాలెట్ పేపర్‌లో 1,2,3 అంకెలతో ప్రాధాన్యత ప్రకారం రోమన్ అంకెలు రాయాలన్నారు. మొదటి ప్రాధాన్యత వేయకుంటే ఆ ఓట్లు చెల్లవని తెలిపారు. నిర్వహణలో తప్పు లు చేస్తే చర్యలు తప్పవన్నారు. పోలింగ్ రోజు ఓటర్‌కు కుడి చేతి మధ్య వేలికి సిరాను వేయాలని ఎన్నికలకమిషన్ సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు పరమేష్, బాలు, సలీం పోలింగ్‌రోజు చేయాల్సిన విధులు, ఓటింగ్ విధానం, వ్యాలిడ్, ఇన్‌వ్యాలిడ్, ఓటు ఇతర విషయాలపై సందేహాలను నివృతి చేశారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...